PM Kisan: భార్యభర్తలిద్దరు పీఎం కిసాన్ ప్రయోజనం పొందవచ్చా..!

Is it possible for both husband and wife to avail PM Kisan benefit
x

PM Kisan: భార్యభర్తలిద్దరు పీఎం కిసాన్ ప్రయోజనం పొందవచ్చా..!

Highlights

PM Kisan: భార్యభర్తలిద్దరు పీఎం కిసాన్ ప్రయోజనం పొందవచ్చా..!

PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వం రైతుల ఖాతాకు సంవత్సరానికి రూ.6000 చొప్పున అందిస్తోంది. కానీ ఇప్పటివరకు ఈ ప్లాన్‌లో చాలా మార్పులు వచ్చాయి. కొన్నిసార్లు దరఖాస్తుకు సంబంధించి ఉంటే మరికొన్ని రైతుల అర్హతల గురించి వచ్చాయి. అయితే ఇప్పుడు భార్యాభర్తలిద్దరిద్దరికి పీఎం కిసాన్ ప్రయోజనం లభిస్తుందా.. అని చాలామంది అడుగుతున్నారు. దీని వాస్తవ నిజాలని తెలుసుకుందాం.

పీఎం కిసాన్ యోజన నిబంధనల ప్రకారం.. భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాన్ని పొందలేరు. ఎవరైనా ఇలా చేస్తే వారిని నకిలీ అని పిలుస్తారు. అనర్హులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే వారు అన్ని వాయిదాలను ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం నిబంధనల ప్రకార రైతు కుటుంబంలో ఎవరైనా పన్ను చెల్లిస్తే ఈ పథకం ప్రయోజనానికి అర్హులు కాదు.

నియమం ప్రకారం ఒక రైతు తన వ్యవసాయ భూమిని వ్యవసాయ పనులకు ఉపయోగించకుండా ఇతర పనులకు ఉపయోగించినట్లయితే అతడు ఈ పథకానికి అర్హుడు కాదు.ఒక రైతు వ్యవసాయం చేస్తున్నప్పటికీ పొలం అతని పేరు మీద కాకుండా అతని తండ్రి లేదా తాత పేరు మీద ఉంటే అతనికి ఈ పథకం ప్రయోజనం లభించదు.ఎవరైనా వ్యవసాయ భూమి యజమాని ప్రభుత్వ ఉద్యోగి అయితే లేదా రిటైర్డ్, సిట్టింగ్ లేదా మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి అయితే వారు కూడా అనర్హులే. ప్రొఫెషనల్ రిజిస్టర్డ్ డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు లేదా వారి కుటుంబ సభ్యులు కూడా అనర్హుల జాబితాలోకి వస్తారు. ఆదాయపు పన్ను చెల్లించే కుటుంబాలకు ఈ పథకం ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories