iphone 11 manufacturing in India: ఐఫోన్ తాజా పోన్ తయారీ చెన్నైలోనే!

apple iphone 11 manufacturing in chennai
x
apple iphone 11
Highlights

iphone 11 manufacturing in India:ఆపిల్ తాజా వెర్షన్ ఐఫోన్ 11 ను చెన్నైలో తయారీ ప్రారంభించారు

ఆపిల్ ఐఫోన్ అనగానే మొబైల్ ఫోన్ లవర్స్ మనసు పారేసుకుంటారు. కాకపోతే ధరల విషయంలో మన దేశంలో అమ్మో ఐఫోనా అనుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి మారేలా కనిపిస్తోంది. ఐఫోన్ తాజా వెర్షన్ 11 ను భారతదేశంలోనే తయారు చేయడం ప్రారంభించింది ఆపిల్ సంస్థ. ఇంతవరకూ చైనాలో తయారవుతున్న ఆపిల్ ఐఫోన్11ను తొలిసారిగా ఇప్పుడు చెన్నైలో ఉత్పత్తి ప్రారంబించారు. దీంతో ఐఫోన్ల ధర కూడా తగ్గే అవకాశం కనిపిస్తోంది.

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ట్విటర్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. దేశంలో మేకిన్‌ ఇండియాలో ఇదో కీలకమైన పురోగతి అని ఆయన పేర్కొన్నారు. ఆపిల్ భారతదేశంలో ఐఫోన్ 11 తయారీని ప్రారంభించింది. దేశంలో మొట్టమొదటిసారిగా టాప్-ఆఫ్-ది-లైన్ మోడల్‌ను తీసుకువస్తోందని ఆయన ట్వీట్‌ చేశారు. ఐఫోన్ ఎక్స్‌ఆర్ స్మార్ట్‌పోన్‌ అసెంబ్లింగ్‌ ప్రారంభించిన తొమ్మిది నెలల తర్వాత ఈ కొత్త పరిణామం చోటు చేసుకుంది. మేడ్ ఇన్ ఇండియా యూనిట్లతో పోలిస్తే దిగుమతి చేసుకున్న స్మార్ట్‌ఫోన్‌లపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో చెన్నైలో తయారయ్యే ఐఫోన్ల ధరలు త్వరలో దిగి రానున్నాయి.

భారతదేశంలో ఐఫోన్ ఎస్‌ఈ 2016 దేశీయ తయారీని బెంగళూరు ప్లాంట్‌లో 2017లో ప్రారంభించింది. ఇప్పుడు అక్కడ ఐఫోన్ ఎస్ఈ 2020ని ఉత్పత్తి చేయడానికి ఆపిల్ సన్నాహాలు చేస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories