Mutual Funds: మ్యూచువల్ ఫండ్ పై ఆసక్తి కనబరుస్తున్న ఇన్వెస్టర్లు.. 2024లో 122 కొత్త పథకాలు లాంచ్..!

Investors are Showing Interest in Mutual Funds 122 New Schemes Launched in 2024
x

Mutual Funds: మ్యూచువల్ ఫండ్ పై ఆసక్తి కనబరుస్తున్న ఇన్వెస్టర్లు.. 2024లో 122 కొత్త పథకాలు లాంచ్..!

Highlights

Mutual Funds: ప్రస్తుతం చాలా మంది మ్యూచువల్ ఫండ్ లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

Mutual Funds: ప్రస్తుతం చాలా మంది మ్యూచువల్ ఫండ్ లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతుంది. నష్టాలు తక్కువగా ఉండడం, రిస్క్ లేకపోవడంతో మ్యూచువల్ ఫండ్ లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 2024 సంవత్సరంలో ఇండెక్స్ ఫండ్స్, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌తో సహా పాసివ్ ఫండ్స్ ఇన్వెస్టర్ ఫోలియో అంటే ఖాతా సంఖ్యలలో 37 శాతం పెరుగుదల ఉంది. నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు 24 శాతానికి పైగా పెరిగి రూ.11 లక్షల కోట్లు దాటాయి.

అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) డేటా ప్రకారం.. మ్యూచువల్ ఫండ్ సంస్థలు 2024లో మొత్తం 122 కొత్త పాసివ్ ఫండ్ పథకాలను ప్రారంభించాయి. ఫండ్ పరిశ్రమలో అత్యంత కీలక కంపెనీలలో ఒకటైన నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు 1.46 కోట్ల పాసివ్ ఫండ్లను కలిగి ఉంది. దీని AUM రూ. 1.65 లక్షల కోట్లు, ETF ట్రేడింగ్ పరిమాణంలో 55శాతం ప్రధాన వాటాను కలిగి ఉంది. కోటక్ మ్యూచువల్ ఫండ్, యాక్సిస్, మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ వంటి ఇతర ఫండ్ హౌస్‌లు కూడా పాసివ్ ఫండ్లలో మంచి వృద్ధిని నమోదు చేశాయి.

పెట్టుబడిదారులు ఎందుకు పెట్టుబడి పెడతారు?

నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్‌లో ఇటిఎఫ్‌ల అధిపతి అరుణ్ సుందరేశన్ మాట్లాడుతూ.. మ్యూచువల్ ఫండ్స్ అనేవి రిస్క్ తక్కువగా ఉండి మంచి లాభాలను అందించే పెట్టుబడి సాదనాలు. ఇన్వెస్ట్ చేసిన డబ్బులను మార్కెట్‌లోని వివిధ విభాగాల్లో తిరిగి ఇన్వెస్ట్ చేస్తారు. వాటిని లాభాలుగా మార్చుతాయి. పెట్టుబడిదారులు సెలక్ట్ చేసుకునేందుకు ప్రస్తుతం మార్కెట్లో చాలా పోర్ట్‌ఫోలియోలు, వివిధ రకాల రిస్క్-రిటర్న్ ప్రొఫైల్‌లను అందించే ప్రత్యేకమైన ఫండ్‌లు ఉన్నాయన్నారు. నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ 2024లో పాసివ్ కేటగిరిలో 8 కొత్త ఫండ్ లను ప్రారంభించింది. ఇప్పుడు అది పరిశ్రమలో 24 ETFలు, 21 ఇండెక్స్ ఫండ్స్ ను కలిగి ఉంది. ఈ కేటగిరీని ఎంచుకోవడంలో పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతున్నట్లు గమనించి, ఇతర AMCలు కూడా అనేక పాసివ్ ఫండ్‌లను ప్రారంభించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories