ఈ ప్రభుత్వ పథకంలో మీ డబ్బు సురక్షితం.. అధిక వడ్డీ మీ సొంతం..

Invest in a Post Office Kisan Vikas Patra Scheme to Keep Your Money Safe | Business News Today
x

ఈ ప్రభుత్వ పథకంలో మీ డబ్బు సురక్షితం.. అధిక వడ్డీ మీ సొంతం.. (ఫైల్ ఫోటో)

Highlights

*పోస్టాఫీసులోని చిన్న పొదుపు పథకాలు మీకు బెస్ట్ అని చెప్పవచ్చు. *ఈ పథకాలలో మీరు బ్యాంకు కంటే మెరుగైన రాబడిని పొందుతారు.

Kisan Vikas Patra: మీరు రాబోయే రోజుల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే పోస్టాఫీసులోని చిన్న పొదుపు పథకాలు మీకు బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ పథకాలలో మీరు బ్యాంకు కంటే మెరుగైన రాబడిని పొందుతారు. ఇందులో పెట్టుబడి పెట్టిన డబ్బు కూడా పూర్తిగా సురక్షితం. బ్యాంకు దివాలా తీసినట్లయితే మీరు కేవలం ఐదు లక్షల రూపాయలు మాత్రమే తిరిగి పొందుతారు. కానీ పోస్టాఫీసులో అలా కాదు. ఇక్కడ పెట్టుబడి పెట్టిన మొత్తం డబ్బుపై ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది.

పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాలలో కిసాన్ వికాస్ పత్ర (SSY) ఒకటి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ డబ్బు 124 నెలల్లో (10 సంవత్సరాల 4 నెలలు) రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం, పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్రలో 6.9 శాతం వడ్డీ రేటు చెల్లిస్తున్నారు. ఇందులో వడ్డీని ప్రతి ఏటా కలుపుతారు. ఈ వడ్డీ రేటు 1 ఏప్రిల్ 2020 నుంచి వర్తిస్తుంది. ఈ పోస్టాఫీసు పథకంలో కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టాలి. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు.

కిసాన్ వికాస్ పత్ర ఒక్కరు లేదా ముగ్గురు పెద్దలు కలిసి ఉమ్మడిగా ఖాతాను ఓపెన్‌ చేయగలరు. మైనర్ తరపున సంరక్షకుడు కూడా ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఈ పథకం కింద 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్ కూడా ఖాతాను తెరిచే అవకాశం ఉంది. ఈ పథకంలో డిపాజిట్ చేయబడిన మొత్తం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు నోటిఫై చేసిన మెచ్యూరిటీ వ్యవధి ఆధారంగా చెల్లింపులు చేస్తుంది. ఇది సమర్పించిన తేదీ నుంచి లెక్క ఉంటుంది.

1. ఖాతాదారు మరణించిన తర్వాత ఇది అతని నామినీకి లేదా చట్టపరమైన వారసుడికి బదిలీ చేస్తారు.

2. ఖాతాదారుడు మరణించిన సందర్భంలో ఖాతాను జాయింట్ హోల్డర్‌కు బదిలీ చేయవచ్చు.

3. కోర్టు ఆదేశాల మేరకు ఖాతా బదిలీ జరుగుతుంది.

4. ఇది కాకుండా ఖాతాను ఏదైనా అధికారి వద్ద తనఖా కూడా పెట్టవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories