
Unemployment: ఇది విన్నారా..! భారత్‌లో నిరుద్యోగం ఎంత ఉందో తెలుసా..?
Unemployment: దేశ ఆర్థిక గమనంలో కీలకమైన శ్రామిక శక్తి మార్కెట్ నుంచి తాజా గణాంకాలు వెలువడ్డాయి. గణాంకాలు, పథక అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పీఎల్‌ఎఫ్‌ఎస్ (PLFS) సర్వే ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో నిరుద్యోగ రేటు 4.8 శాతం నుంచి 5 శాతానికి చేరుకుంది.
Unemployment: దేశ ఆర్థిక గమనంలో కీలకమైన శ్రామిక శక్తి మార్కెట్ నుంచి తాజా గణాంకాలు వెలువడ్డాయి. గణాంకాలు, పథక అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పీఎల్‌ఎఫ్‌ఎస్ (PLFS) సర్వే ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో నిరుద్యోగ రేటు 4.8 శాతం నుంచి 5 శాతానికి చేరుకుంది. గణాంకాల పరంగా ఇది స్వల్ప మార్పులా అనిపించినా, క్షేత్రస్థాయిలో ఉన్న సవాళ్లను ఇది ప్రతిబింబిస్తోంది.
గ్రామాల్లో ఎందుకు పెరిగింది?
సాధారణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటుంది. శీతాకాలం ముగిసే సమయానికి పంట కోతలు పూర్తవుతాయి. ఆ తర్వాత కొత్త పంట సాగుకు మధ్య ఉండే 'విరామ సమయం' (Gap period) వల్ల వ్యవసాయ కూలీలకు ఉపాధి తగ్గుతుంది. దీనికి తోడు చలితీవ్రత వల్ల నిర్మాణ రంగ పనులు కూడా మందగించాయి. డిసెంబర్‌లో: 3.9 శాతం,జనవరిలో: 4.2 శాతంగా నమెదు చేశాయి.
పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి
పట్టణాల్లోనూ నిరుద్యోగ రేటు 6.7 శాతం నుంచి 7 శాతానికి ఎగబాకింది. సేవా రంగం మరియు చిన్న తరహా పరిశ్రమల్లో నెలకొన్న మార్పులు ఈ పెరుగుదలకు కారణమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉపాధి రంగంలో మహిళల ప్రాతినిధ్యంపై సర్వే ఆసక్తికర అంశాలను వెల్లడించింది.గ్రామీణ మహిళల భాగస్వామ్యం: 39.7%,పట్టణ మహిళల భాగస్వామ్యం: 25.5%గా నమోదైంది. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో మహిళలు ఎక్కువగా ఉపాధి పనుల్లో (ప్రధానంగా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు) పాల్గొంటున్నారని ఈ డేటా చెబుతోంది.
ఈ పెరుగుదల ప్రధానంగా సీజనల్ ప్రభావమేనని మంత్రిత్వ శాఖ పేర్కొన్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర ఉపాధి కల్పనను పెంచాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు గుర్తు చేస్తున్నాయి. వాతావరణం మారి, వేసవి పనులు ప్రారంభమైతే ఈ రేటు మళ్ళీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




