Forex Reserve: ఫస్ట్ టైం 700బిలియన్ డాలర్లను క్రాస్ చేసి రికార్డు క్రియేట్ చేసిన ఫారెక్స్ నిల్వలు

Forex Reserve
x

Forex Reserve: ఫస్ట్ టైం 700బిలియన్ డాలర్లను క్రాస్ చేసి రికార్డు క్రియేట్ చేసిన ఫారెక్స్ నిల్వలు

Highlights

Forex Reserve: భారత ఆర్థిక వ్యవస్థకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన గుడ్ న్యూస్ రానే వచ్చింది. మన దేశ విదేశీ మారక నిల్వలు, అంటే దేశం దగ్గర ఉన్న విదేశీ కరెన్సీ నిల్వలు, మళ్ళీ 700 బిలియన్ డాలర్ల మార్కును దాటాయి.

Forex Reserve: భారత ఆర్థిక వ్యవస్థకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన గుడ్ న్యూస్ రానే వచ్చింది. మన దేశ విదేశీ మారక నిల్వలు, అంటే దేశం దగ్గర ఉన్న విదేశీ కరెన్సీ నిల్వలు, మళ్ళీ 700 బిలియన్ డాలర్ల మార్కును దాటాయి. అక్టోబర్ 2024 తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఇది మన ఆర్థిక స్థితికి మంచి సంకేతం. జూన్ 27తో ముగిసిన వారంలో మన నిల్వలు రూ.4.84 బిలియన్ డాలర్లు పెరిగి మొత్తం రూ.702.78 బిలియన్ డాలర్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. గత 9 నెలలుగా ఈ మార్కును దాటడానికి మనం ప్రయత్నిస్తున్నాం, ఇప్పుడు అది సాధ్యమైంది.

ఈ ఏడాది (2025)లో ఇప్పటివరకు మన విదేశీ మారక నిల్వలు ఏకంగా రూ.58.39 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఇది చాలా పెద్ద వృద్ధి. ప్రపంచంలోని చాలా దేశాల మొత్తం విదేశీ మారక నిల్వలు కూడా ఇంత ఉండవు అనడంలో ఆశ్చర్యం లేదు. ఈ పెరుగుదలతో ప్రపంచంలోనే అత్యధిక విదేశీ మారక నిల్వలు ఉన్న నాల్గవ దేశంగా భారత్ నిలిచింది. భారత్ కంటే ముందు చైనా, జపాన్, స్విట్జర్లాండ్ మాత్రమే ఉన్నాయి. ఇది దేశ ఆర్థిక స్థిరత్వానికి, అంతర్జాతీయ మార్కెట్లో భారత బలానికి నిదర్శనం.

స్వల్పంగా తగ్గిన బంగారం నిల్వలు

అయితే, దేశ మొత్తం విదేశీ మారక నిల్వలు పెరిగినప్పటికీ బంగారు నిల్వలు మాత్రం గత వారంలో స్వల్పంగా తగ్గాయి. 1.23 బిలియన్ డాలర్లు తగ్గి, ప్రస్తుతం అవి 84.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు భారీగా పెరగడంతో ఈ స్వల్ప తగ్గుదల మొత్తం నిల్వల వృద్ధిపై పెద్దగా ప్రభావం చూపలేదు.

పొరుగు దేశం పాకిస్తాన్ పరిస్థితి

ఇదిలా ఉండగా, పొరుగు దేశం పాకిస్తాన్ విదేశీ మారక నిల్వల్లో కూడా కాస్త పెరుగుదల కనిపించింది. పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, జూన్ 30 నాటికి వారి నిల్వలు 14.51 బిలియన్ డాలర్లకు చేరాయి. చైనా ఇచ్చిన 3.4 బిలియన్ డాలర్ల రుణమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. ఈ డబ్బు పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి సహాయం పొందడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories