లాభాల బాటన దేశీ స్టాక్‌ మార్కెట్లు

Indian Stock Markets are in the way of Profits
x

Representational Image

Highlights

* దిగ్గజ షేర్లలో కొనుగోళ్ల అండతో వరుసగా ఏడో రోజు లాభాలు * బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ 200 పాయింట్లు అప్ * జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ నిఫ్టీ 15,200 మార్క్‌కు చేరువ

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుస లాభాలతో దూసుకెళ్తున్నాయి. దిగ్గజ షేర్లలో కొనుగోళ్ల అండతో వరుసగా ఏడో రోజు సూచీలు లాభాలతో మొదలయ్యాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా లాభంతో దూకుడు మీద వుండగా జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ నిఫ్టీ 15వేల 200 మార్క్‌కు చేరువవుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 238 పాయింట్ల లాభంతో 51వేల 587 వద్ద, నిఫ్టీ 85 పాయింట్ల లాభంతో 15వేల 201 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఆర్థికవృద్ధి రికవరీపై ఆర్‌బీఐ చేసిన సానుకూల వ్యాఖ్యలతో తాజావారంలో తొలి సెషన్ ను లాభాలను అందించిన మార్కెట్లు మలి సెషన్ లోనూ అదే జోరును కొనసాగిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories