Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట

X
Representational Image
Highlights
Stock Markets: గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపధ్యం * తాజా సెషన్ లో దేశీ సూచీలు యూ-టర్న్
Sandeep Eggoju23 Feb 2021 4:29 AM GMT
Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపధ్యంలో దేశీ సూచీలు క్రితం సెషన్ నుంచి యూ-టర్న్ తీసుకుని లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 250 పాయింట్లు ఎగబాకగా నిఫ్టీ 14,750 పాయింట్ల వద్ద కదలాడుతోంది. ఆరంభ ట్రేడింగ్ లో బీఎస్ఈ సెన్సెక్స్ 0.45 శాతం మేర లాభంతో
49,969 వద్దకు చేరగా అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 0.47 శాతం ఎగసి 14,744 వద్ద కదలాడుతున్నాయి. వరుసగా ఐదు రోజుల పాటు నష్టాల బాటన సాగిన సూచీలు తాజా సెషన్ లో యూ-టర్న్ తీసుకోవడంతో మార్కెట్ లో అప్రమత్తత వాతావరణం కొనసాగుతోంది.
Web TitleStock Markets: Indian stock Markets Are In The Path Of Profit
Next Story