పది, ఐటీఐ చదివిన వారికి సువర్ణవకాశం.. చివరితేదీ వచ్చేసింది..!

Indian Railway jobs 2022 Apply for Railway jobs last date is Approaching
x

పది, ఐటీఐ చదివిన వారికి సువర్ణవకాశం.. చివరితేదీ వచ్చేసింది..!

Highlights

Indian Railway Jobs 2022: ఇండియన్ రైల్వే 1654 అప్రెంటిస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది

Indian Railway Jobs 2022: ఇండియన్ రైల్వే 1654 అప్రెంటిస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrcpryj.orgని సంప్రదించి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 1, 2022గా నిర్ణయించారు. అభ్యర్థులు 2022 ఆగస్టు 1 నాటికి 15 ఏళ్లు నిండి ఉండాలి 24 ఏళ్లు మించకూడదు. రిజర్వ్‌డ్ కేటగిరీకి నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.

భారతీయ రైల్వే అధికారిక ప్రకటనలో విద్యా అర్హతను పేర్కొంది. "అభ్యర్థి తప్పనిసరిగా SSC / మెట్రిక్ / 10వ తరగతి పరీక్ష లేదా దానికి సమానమైన గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన NCVT/SCVT ద్వారా జారీ చేసిన సంబంధిత ట్రేడ్‌లో ITI కలిగి ఉండాలి.

ఎలా దరఖాస్తు చేయాలి..?

1. అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ rrcpryj.orgని సందర్శించాలి. వెబ్‌సైట్ హోమ్‌పేజీలో మీరు దరఖాస్తు చేసుకోవడానికి నేరుగా లింక్‌ను పొందుతారు. దానిపై క్లిక్ చేయండి.

2. ఇప్పుడు మీ ముందు కొత్త లాగిన్ రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్‌ అవుతుంది.

3. ఇప్పుడు అవసరమైన వివరాలను ఎంటర్‌ చేసి నమోదు చేసుకోవాలి.

4. తర్వాత లాగిన్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.

5. దరఖాస్తు ఫారమ్‌ను నింపి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

6. తర్వాత దరఖాస్తు రుసుమును చెల్లించి ఫారమ్‌ను సమర్పించాలి.

7. ఇప్పుడు ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories