UPI Payments: UPI చెల్లింపుల్లో మన దేశమే టాప్..! నెలకు 1800 కోట్లకు పైగా లావాదేవీలు

UPI Payments
x

UPI Payments: UPI చెల్లింపుల్లో మన దేశమే టాప్..! నెలకు 1800 కోట్లకు పైగా లావాదేవీలు

Highlights

UPI Payments: ప్రపంచంలోని అన్ని దేశాల కంటే మన దేశంలోనే UPI చెల్లింపులు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతి నెల 1800 కోట్ల రూపాయలు పైనే లావాదేవీలు జరుగుతున్నాయి.

UPI Payments: ప్రపంచంలోని అన్ని దేశాల కంటే మన దేశంలోనే UPI చెల్లింపులు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతి నెల 1800 కోట్ల రూపాయలు పైనే లావాదేవీలు జరుగుతున్నాయి. గతేడాది మొత్తంలో 24.03 లక్షల కోట్ల రూపాయలు లావాదేవీలు నమోదయ్యాయి. ఇంకా ఈ వివరాలను తెలుసుకుందాం..

పది రూపాయలు చెల్లించాలన్నా కూడా ఇప్పుడు ఎక్కువమంది యూపీఐనే వాడుతున్నారు. కానీ, క్యాష్‌ని ఎక్కడా ఉపయోగించడం లేదు. ఇటు ప్రజలు అటు వ్యాపారులు రికార్డ్ స్థాయిలో యుపీఐని వాడుతున్నారు. లక్షల కోట్ల లావాదేవీలు జరుపుతున్నారు.

దేశం మొత్తం డిజిటల్ మయం అయిపోయింది. అందుకు నిదర్శనమే ఇది. దేశంలో మొత్తం 49.1 కోట్ల మంది ప్రజలు, 6.5 కోట్ల మంది వ్యాపారులు యూపీఐని ఉపయోగిస్తున్నారు. గతేడాది ఏకంగా 24.03 లక్షల కోట్ల రూపాయలు లావాదేవీలు నమోదయ్యాయి. ఈ ప్రపంచంలోని మరేదేశం ఇంతమొత్తంలో లావాదేవీలు జరపలేదు. అందుకే మన దేశంలో టాప్‌లో నిలిచింది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది.

ప్రతి ఒక్కరి చేతిలో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉంది. అందుకే క్యాష్‌ని క్యారీ చేయకుండా ఫోన్‌ ద్వారానే డబ్బుల లావాదేవీలు ఈజీగా జరిపేస్తున్నారు. ప్రతీ నెల 1800 కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో రూ.24.03 లక్షల కోట్లు యూపీఐ ద్వారా ట్రాన్స్ ఫర్ అయ్యాయి. మొత్తం 18.39 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయి. ఇదిలాంటే 2024లో ఇదే నెలలో 13.88 బిలియన్ లావాదేవీలు కాగా.. ప్రస్తుతం దీని వృద్ది రేటు 32 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 49.1 కోట్ల మంది సామన్య ప్రజలు, 6.5 కోట్లమంది వ్యాపారులు ఈ యూపీఐ సేవలను వినియోగిస్తున్నారు. దేశంలో మొత్తానికి 675 బ్యాంకులు యూపీఐ సేవలను అందిస్తున్నాయి.

దేశంలో క్యాష్ అనేది ఎక్కడా కనిపించడంలేదు. మొత్తం డిజిటల్ చెల్లెంపుల్లో 85శాతం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. ప్రపంచంలో రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 50 శాతం చెల్లింపులు మన దేశంలో మాత్రమే జరుగుతుండటం విశేషం. భారత్‌తో పాటు యుఏఈ, సింగ్ పూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ వంటి ఏడు దేశాల్లో యూపీఐ సేవలను అనుమతిస్తున్నాయి.

ఇదిలా ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు యూపీఐలో మార్పులు చేసుకుంటూ ముందుకు వెళుతుంది. తాజాగా బ్రిక్స్ సభ్యత్వ దేశాలకు యూపీఐని విస్తరించాలని రిజర్వ్ బ్యాంకు ఆలోచిస్తోంది. యూపీఐ బిల్లులు మొదట్లో జరపడానికి చాలా మంది చాలా ఇబ్బందులు పడేవారు. అయితే ఇటీవల కాలంలో వీటిపైన ప్రజలందరికీ ఇంట్రెస్ట్ పెరిగింది. దీనివల్లే ఇంతలా యూపీఐ లావాదేవీలు జరగినట్లు తెలస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories