Income Tax Rules 2026: ఎంప్లాయీస్‌కు పండగే.. పెరగనున్న 'మీల్ వోచర్' మినహాయింపు!

Income Tax Rules 2026: ఎంప్లాయీస్‌కు పండగే.. పెరగనున్న మీల్ వోచర్ మినహాయింపు!
x

Income Tax Rules 2026: ఎంప్లాయీస్‌కు పండగే.. పెరగనున్న 'మీల్ వోచర్' మినహాయింపు!

Highlights

మీరు మీ ఆఫీసులో సోడెక్సో (Sodexo) లేదా జాగిల్ (Zaggle) వంటి భోజన వోచర్లు వాడుతున్నారా? అయితే ప్రభుత్వం మీకు భారీ టాక్స్ రిలీఫ్ ఇవ్వబోతోంది.

మీరు మీ ఆఫీసులో సోడెక్సో (Sodexo) లేదా జాగిల్ (Zaggle) వంటి భోజన వోచర్లు వాడుతున్నారా? అయితే ప్రభుత్వం మీకు భారీ టాక్స్ రిలీఫ్ ఇవ్వబోతోంది. ప్రస్తుతం భోజనానికి కేవలం రూ.50గా ఉన్న మినహాయింపు పరిమితిని ఏకంగా రూ. 200కి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ఉన్న నియమం ప్రకారం.. యజమాని అందించే ఒక భోజనం విలువ రూ. 50 దాటితే, ఆ పైన ఉన్న మొత్తంపై ఉద్యోగి పన్ను కట్టాల్సి వచ్చేది. కానీ తాజా ముసాయిదా ప్రకారం.. ఈ పరిమితిని రూ. 200కి పెంచారు. అంటే, రోజుకు రెండు భోజనాలు (రూ. 400 వరకు) తీసుకున్నా, వాటిపై మీరు పైసా పన్ను కట్టక్కర్లేదు.

పన్ను ఎంత ఆదా అవుతుందంటే..

ఒక ఉద్యోగి నెలకు 22 రోజులు ఆఫీసుకు వెళ్తున్నారనుకుంటే.. పన్ను మినహాయింపు లెక్క ఇలా ఉంటుంది..

రోజువారీ మినహాయింపు రూ. 200 × 2 భోజనాలు.. రూ. 400

నెలవారీ మినహాయింపు రూ. 400 × 22 పనిదినాలు.. రూ. 8,800

వార్షిక మినహాయింపు.. రూ. 8,800 × 12 నెలలు.. రూ. 1,05,600

పాత నిబంధన ప్రకారం కేవలం రూ. 26,400 మాత్రమే మినహాయింపు వచ్చేది. ఇప్పుడు అది రూ. 1.05 లక్షలకు చేరింది. అంటే సుమారు రూ. 79,200 అదనపు ఆదాయంపై మీరు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 30% పన్ను స్లాబ్‌లో ఉంటే (సెస్ కలిపి 31.2%), ఏడాదికి దాదాపు రూ. 24,710 పన్ను ఆదా అవుతుంది. అయితే ఇక్కడే చిన్న సస్పెన్స్ ఉంది. పాత పన్ను విధానం (Old Tax Regime) లో ఉద్యోగికి రూ.200 మినహాయింపు కచ్చితంగా వర్తిస్తుంది. ప్రస్తుత చట్టం ప్రకారం కొత్త విధానం ఎంచుకున్న వారికి భోజన వోచర్లపై మినహాయింపు లేదు. అయితే 2026 ముసాయిదా చట్టంలో దీనిని నిరాకరించే ప్రత్యేక నిబంధన ఏదీ లేదు. పార్లమెంట్ ఆమోదం తర్వాత ప్రభుత్వం ఇచ్చే క్లారిటీని బట్టి వీరికి లాభం ఉందో లేదో తెలుస్తుంది.

ఈ ప్రయోజనం ఎప్పుడు వర్తించదంటే..

భోజనం విలువ రూ. 200 లోపు ఉండి, ఆఫీసులోనే ఉచితంగా ఆహారం అందిస్తే.

ఆఫీసులో ఇచ్చే టీ లేదా స్నాక్స్‌కు.

మారుమూల ప్రాంతాలు లేదా ఆఫ్‌షోర్ క్యాంపుల్లో ఇచ్చే భోజనానికి (అక్కడ ఇతర నిబంధనలు ఉంటాయి).

ఒకవేళ ఈ ప్రతిపాదన పార్లమెంట్ ఆమోదం పొంది చట్టంగా మారితే, 80C, 80D వంటి ఇతర మినహాయింపులతో పాటు ఈ భోజన వోచర్ల బెనిఫిట్ కూడా తోడైతే ఉద్యోగుల చేతిలో మిగిలే నికర ఆదాయం (Take Home Salary) గణనీయంగా పెరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories