ఉచితంగా 2 లక్షల ప్రయోజనం.. ఈ ప్రభుత్వ కార్డు కోసం అప్లై చేశారా..!

If You Want Two Lakh Benefits for Free Apply for This e Shram Card Launched by the Government
x

ఉచితంగా 2 లక్షల ప్రయోజనం.. ఈ ప్రభుత్వ కార్డు కోసం అప్లై చేశారా..!

Highlights

E Shram Card: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రజలకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్ యోజనను ప్రారంభించింది.

E Shram Card: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రజలకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్ యోజనను ప్రారంభించింది. దీనికోసం కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ-శ్రమ్ పోర్టల్ ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం కార్మికులకు నగదు సహాయంతో పాటు ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. లబ్ధిదారులు ఈ-శ్రమ్ యోజన కోసం అధికారిక వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలి. ఈ పథకం కింద కార్మికులే కాకుండా సాధారణ నివాసితులు, తక్కువ ఆదాయ కుటుంబాలతో సహా విద్యార్థులు కూడా నమోదు చేసుకోవచ్చు.

రెండు లక్షల రూపాయలు ప్రయోజనం

ఈ పథకం కింద ప్రజలు వివిధ ప్రయోజనాలను పొందుతారు. అందులో ఒకటి చాలా ముఖ్యమైనది. వాస్తవానికి, ఈ-లేబర్ కార్డ్ ఉన్న వ్యక్తి ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద రూ. 2 లక్షల ప్రమాద బీమా రక్షణకు అర్హులు. రెండు లక్షల రూపాయల ప్రయోజనం కూడా పొందుతాడు. దీని కోసం మీరు ఈ-లేబర్ కార్డును తయారు చేసే ప్రక్రియ గురించి తెలుసుకోవాలి.

ఈ శ్రమ్‌ కార్డు ఆన్‌లైన్ ప్రాసెస్

1. E-Shram పోర్టల్ (eshram.gov.in) అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి 'రిజిస్టర్ ఆన్ ఈ-శ్రమ్‌ పై క్లిక్ చేయండి.

2. ఆధార్ కార్డుతో లింక్‌ అయిన మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేయండి.

3. EPFO/ESICలో సభ్యులా కాదా (అవును/కాదు) ఎంచుకోండి.

4. 'గెట్ OTP'పై క్లిక్ చేయండి.

5. OTPని ఎంటర్‌ చేసిన తర్వాత ఈ-లేబర్ కోసం రిజిస్ట్రేషన్ ఫారమ్ ఓపెన్‌ అవుతుంది.

6. మీ ఆధార్ కార్డ్ నంబర్‌ను ఎంటర్‌ చేయండి. నిబంధనలు, షరతులకు అంగీకరించడానికి బాక్స్‌పై క్లిక్ చేసి ఆపై కంటిన్యూ చేయండి.

7. మీ నమోదిత మొబైల్ నంబర్‌కు పంపిన OTPని ఎంటర్‌ చేయండి.

8. ముందుగా నింపిన ఫారమ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. మీ వివరాలను ధృవీకరించి, కొనసాగించుపై క్లిక్ చేయండి.

9. రిజిస్ట్రేషన్ ఫారమ్/సెల్ఫ్ డిక్లరేషన్ ప్రివ్యూ కనిపిస్తుంది. మొత్తం సమాచారం సరిగ్గా పూరించినట్లయితే అన్ని వివరాలను ధృవీకరించి డిక్లరేషన్ బాక్స్‌పై క్లిక్ చేసి తదుపరి కొనసాగించడానికి సమర్పించండి.

10. మీ మొబైల్ నంబర్‌కు పంపిన OTPని ఎంటర్‌ చేసి, ధృవీకరించడానికి దానిపై క్లిక్ చేయండి.

11. మీ రిజిస్ట్రేషన్ పూర్తయినట్లే.

12. UAN కార్డ్ మీ స్క్రీన్‌పై జనరేట్ అవుతుంది.

13. తర్వాత UAN కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories