Post Office Scheme: పోస్టాఫీస్‌ బెస్ట్‌ స్కీం.. లక్షల్లోఇన్‌కమ్‌ సంపాదించే మార్గం..!

If you Invest in Post Office Time Deposit Scheme you can Earn Interest Income in Lakhs
x

Post Office Scheme: పోస్టాఫీస్‌ బెస్ట్‌ స్కీం.. లక్షల్లోఇన్‌కమ్‌ సంపాదించే మార్గం..!

Highlights

Post Office Scheme: ఈ రోజుల్లో ఇన్వెస్ట్‌ చేయడానికి మార్కెట్‌లో చాలా ఆప్షన్స్‌ ఉన్నాయి. కానీ భద్రత కరువైంది. ముందుగా అధిక వడ్డీ ఆశచూపి డబ్బులు ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత కంపెనీ ఎత్తేస్తున్నారు.

Post Office Scheme: ఈ రోజుల్లో ఇన్వెస్ట్‌ చేయడానికి మార్కెట్‌లో చాలా ఆప్షన్స్‌ ఉన్నాయి. కానీ భద్రత కరువైంది. ముందుగా అధిక వడ్డీ ఆశచూపి డబ్బులు ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత కంపెనీ ఎత్తేస్తున్నారు. దీనివల్ల చాలామంది వారి కష్టర్జితం కోల్పోతున్నారు. అందుకే డబ్బులు ఎప్పుడైనా సరే గవర్నమెంట్‌ సెక్యూరిటీ ఉన్న దాంట్లో పెట్టుకోవడం ఉత్తమం. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్లకి పోస్టాఫీసుకు మించిన సెక్యూరిటీ మరొకటి లేదు. అంతేకాకుండా ఇందులో పెట్టుబడులపై కేంద్ర ప్రభుత్వం మంచి వడ్డీ కూడా అందిస్తుంది. ఈ రోజు పోస్టల్‌ టైమ్‌ డిపాజిట్‌ స్కీం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పోస్టాఫీసు టైం డిపాజిట్‌లో ప్రస్తుతం వడ్డీ రేటు 7 శాతం నుంచి 7.5 శాతానికి పెంచారు. ఇందులో మీ పెట్టుబడి 100 శాతం సురక్షితంగా ఉంటుంది. అలాగే .5 శాతం వడ్డీ ప్రయోజనం లభిస్తుంది. ఈ స్కీమ్ కింద ఇన్వెస్టర్లు ఏడాది నుంచి 5 సంవత్సరాల వరకు పెట్టుబడి కాలాన్ని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఏడాది కాలానికి చేసే పెట్టుబడులకు 6.9 శాతం, 2-3 సంవత్సరాలకు చేసే పెట్టుబడులకు 7 శాతం, ఐదేళ్ల కాలానికి పెట్టుబడికి 7.5 శాతం వడ్డీని పోస్టాఫీసు ఆఫర్ చేస్తోంది. ఈ లెక్కన ఎవరైనా ఇన్వెస్టర్ రూ.5 లక్షలను ఐదేళ్ల కాలానికి పెట్టుబడిగా పెట్టినట్లయితే వారికి వడ్డీ రూపంలో రూ.2,24,974 ఆదాయం వస్తుంది. అంటే పెట్టుబడి పెట్టిన మెుత్తం డబ్బు విలువ ఏకంగా రూ.7,24,974కి పెరుగుతుంది.

అయితే చాలా మంది మదిలో ఉండే అనుమానం ఈ పెట్టుబడులపై పన్ను మినహాయింపులు ఉంటాయా.. ఉండవా.. అన్నదే. ఆదాయపుపన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద పెట్టుబడిదారులు పన్ను మినహాయింపును అందుకుంటారు. ఇన్వెస్ట్ చేసేందుకు ఇండివిడ్యువల్ లేదా ఉమ్మడి ఖాతా ఓపెన్‌ చేయవచ్చు. 10 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల పేరుపై ఖాతాను వారి కుటుంబ సభ్యులు తెరవొచ్చు. ఇందుకోసం కనీసం రూ.1,000 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories