Pension Scheme: నెలకు రూ.100 కడితే చాలూ.. ఏడాదికి రూ.36 వేల ఆదాయం.. ఈ బంపర్ లాభాలు అందించే ఫథకం ఏంటో తెలుసా?

If you Earn Rs.100 per month Rs.36 thousand income per year in Pradhan Mantri Shram Yogi Man Dhan Yojana Scheme
x

Pension Scheme: నెలకు రూ.100 కడితే చాలూ.. ఏడాదికి రూ.36 వేల ఆదాయం.. ఈ బంపర్ లాభాలు అందించే ఫథకం ఏంటో తెలుసా?

Highlights

Investment: 30 ఏళ్ల వయసు వారు ఈ పథకంలో ప్రతినెల రూ. 100లు చెల్లించాలి. 60 ఏళ్ల వరకు కట్టాల్సి ఉంటుంది. అంటే భార్యాభర్తలు ఈ పథకంలో చేరితే నెలకు రూ. 200లు చెల్లించాల్సి ఉంటుంది.

Pension Scheme: అద్భుత స్కీమ్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. దీంతో పెళ్లైన జంటలు ప్రతి ఏటా భారీగా ఆదాయం పొందవచ్చు. కేవలం ప్రతినెలా రూ.200 కడితే రూ. 72 వేలు ప్రయోజనం పొందవచ్చు. ఇంత మంచి స్కీమ్ గురించి తెలుసుకోకుంటే ఎలా? పదండి మరి.. ఈ స్కీమ్ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.. సెంట్రల్ గవర్నమెంట్ ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. వీటిల్లో ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన ఎంతో ఉపయోగకరమైనది. దీంతో అదిరిపోయే బెనిఫిట్స్ పొందవచ్చు.

అసంఘటిత రంగంలో పనిచేసే వారికి ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్యేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్నితీసుకువచ్చింది. ఇది ఒక పెన్షన్ ప్లాన్ అన్నమాట. అంటే దీని బెనిఫిట్స్ పదవి విరమణ వయసు నుంచి ప్రతి నెలా ప్రయోజనం పొందవచ్చు.

ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకాన్ని కేంద్ర కార్మిక శాఖ 2019లో అందుబాటులోకి తీసుకొచ్చింది. భార్యాభర్తలు ఇద్దరూ ఈ స్కీంలో పెట్టుబడి పెట్టొచ్చు. కేవలం నెలకు రూ. 200 కడితే చాలండోయ్. ఏటా రూ. 72 వేలు పొందొవచ్చన్నమాట.

కూలీ పనులు చేసేవారు, అగ్రికల్చర్, ఇటుకల బట్టిల్లో వర్క్ చేసే వారు ఇలా ఎందరో అసంఘటిత రంగంలో పనిచేసే వారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. అయితే, ఇందుకు ఒక కండీషన్ ఉంది. అదేంటంటే, నెల వారి ఇన్‌కం రూ. 15 వేలు కన్నా తక్కువ ఉండాలి.

18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు గల వారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. అలాగే ఎన్‌పీఎస్ (నేషనల్ పెన్షన్), ఈఎస్ఐ (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్), ఈపీఎఫ్‌వో (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) స్కీమ్స్‌లో చేరని వారు మాత్రమే ఈ పథకంలో చేరొచ్చు. వీరితోపాటు టాక్స్ చెల్లించేవారు ఈ పథకంలో చేరేందుకు కుదరదు.

30 ఏళ్ల వయసు వారు ఈ పథకంలో ప్రతినెల రూ. 100లు చెల్లించాలి. 60 ఏళ్ల వరకు కట్టాల్సి ఉంటుంది. అంటే భార్యాభర్తలు ఈ పథకంలో చేరితే నెలకు రూ. 200లు చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు వచ్చిన తర్వాత నుంచి నెలకు రూ. 3,000లు పెన్షన్ అందుకుంటారు. దీంతో లైఫ్ లాండ్ డబ్బులు అందుకోవచ్చు.

అంటే ఏడాదికి రూ. 36,000లు వస్తాయి. ఇక భార్యభర్తలు ఇద్దరూ రూ. 72,000లు అందుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నంబర్‌ ఉన్నవాళ్లు కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఈ పథకంలో చేరొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories