Indian Railways: టికెట్ కన్ఫర్మ్ కాకపోతే 3 రెట్లు రిఫండ్? అదరగొడుతున్న కొత్త సిస్టమ్!

Indian Railways
x

Indian Railways: టికెట్ కన్ఫర్మ్ కాకపోతే 3 రెట్లు రిఫండ్? అదరగొడుతున్న కొత్త సిస్టమ్!

Highlights

Indian Railways: వేసవి సెలవులు, పండుగల సీజన్లలో రైలు టికెట్ల వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు తలనొప్పిగా మారుతుంది. అయితే ఇప్పుడు ఐక్సిగో (Ixigo), రెడ్‌బస్ (RedBus), మేక్‌మైట్రిప్ (MakeMyTrip) వంటి ప్రముఖ ట్రావెల్ ప్లాట్‌ఫారమ్‌లు ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొన్నాయి.

Indian Railways: వేసవి సెలవులు, పండుగల సీజన్లలో రైలు టికెట్ల వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు తలనొప్పిగా మారుతుంది. అయితే ఇప్పుడు ఐక్సిగో (Ixigo), రెడ్‌బస్ (RedBus), మేక్‌మైట్రిప్ (MakeMyTrip) వంటి ప్రముఖ ట్రావెల్ ప్లాట్‌ఫారమ్‌లు ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొన్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లు 'టికెట్ కన్ఫర్మేషన్ అష్యూరెన్స్' (Ticket Confirmation Assurance) అనే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాయి, ఇది వెయిటింగ్ లిస్ట్ టికెట్‌లకు మూడు రెట్లు వరకు రిఫండ్‌ను హామీ ఇస్తుంది.

ఎలా పనిచేస్తుంది?

ఈ కొత్త సదుపాయం కింద, ప్రయాణికులు టికెట్ బుకింగ్ చేసేటప్పుడు ఒక అదనపు 'అష్యూరెన్స్' ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఒకవేళ వారి టికెట్ చార్ట్ తయారయ్యే సమయానికి కన్ఫర్మ్ కాకపోతే, వారికి ప్రత్యామ్నాయంగా కన్ఫర్మ్ అయిన ట్రావెల్ ఆప్షన్ లభిస్తుంది. ఒకవేళ ప్రత్యామ్నాయ టికెట్ లభించకపోతే వారికి మూడు రెట్లు వరకు రిఫండ్ వస్తుంది.

* ఐక్సిగో (Ixigo): రెండు లేదా మూడు రెట్లు రిఫండ్ ఆప్షన్‌ను అందిస్తుంది.

* రెడ్‌బస్ (RedBus): రైలు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఆటోమేటిక్ గా బస్ టికెట్‌ను బుక్ చేయడానికి ప్రయత్నిస్తుంది.

* మేక్‌మైట్రిప్ (MakeMyTrip): ప్రయాణికులకు రిఫండ్ లేదా లభ్యత ఆధారంగా ఆల్టర్నేటివ్ ట్రావెల్ ఆప్షన్ అందిస్తుంది.

అయితే, ఈ సదుపాయం కోసం ఒక అదనపు 'అష్యూరెన్స్ ఫీజు' (Assurance Fee) చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు టికెట్ టైప్, ప్రయాణ తేదీ, ప్లాట్‌ఫారమ్‌ను బట్టి మారుతుంది. టికెట్ కన్ఫర్మ్ అయినప్పటికీ ఈ ఫీజు తిరిగి ఇవ్వబడదు.

వేలాది మంది ప్రయాణికులకు వరం

భారతీయ రైల్వే (IRCTC) గణాంకాల ప్రకారం, ముఖ్యంగా సెలవులు, పండుగల సమయంలో వేలాది మంది ప్రయాణికులు కన్ఫర్మ్ కాని టికెట్ల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో.. ఈ సదుపాయం ప్రయాణికులకు ఒక వరంగా మారవచ్చు. ఇది ప్రయాణ ప్రణాళికలలో అనిశ్చితిని తగ్గిస్తుంది.ప్రయాణికులకు కొంత ఆర్థిక భద్రతను అందిస్తుంది.

మూడు రెట్లు రిఫండ్

ఈ యాప్‌ల ద్వారా ట్రావెల్ బుకింగ్ చేస్తే మీకు 3 రెట్లు ఫిక్స్‌డ్ రిటర్న్ లభించవచ్చు. ఉదాహరణకు, మీరు ఈ యాప్‌ల ద్వారా రూ. 1,000 టికెట్ బుక్ చేస్తే, మీకు మొత్తం రూ. 3,000 వరకు రిఫండ్ లభించవచ్చు. అయితే, దీనికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. రిఫండ్, ప్రత్యామ్నాయ టికెట్ నియమాల ప్రకారం నిర్ణయించబడతాయి. ఒకవేళ మీరు కన్ఫర్మేషన్ కోసం ఫీజు చెల్లించి ఉంటే, టికెట్ రద్దు అయిన తర్వాత కూడా ఆ ఫీజు తిరిగి ఇవ్వబడదు. ఈ కొత్త సదుపాయం ప్రయాణికులకు చాలా సౌకర్యాన్ని అందిస్తుంది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో టికెట్ కన్ఫర్మేషన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ప్రయాణం చేయడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్.

Show Full Article
Print Article
Next Story
More Stories