మొబైల్ వినియోగదారులకు షాకింగ్‌ న్యూస్..1 జీబీ డేటా రూ.35 ?

మొబైల్ వినియోగదారులకు షాకింగ్‌ న్యూస్..1 జీబీ డేటా రూ.35 ?
x
IDEA VodaFone File Photo
Highlights

మొబైల్ వినియోగదారులకు మరో షాక్ న్యూస్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి ప్రముఖ నెట్ వర్క్ కంపేనీలు.

మొబైల్ వినియోగదారులకు మరో షాక్ న్యూస్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి ప్రముఖ నెట్ వర్క్ కంపేనీలు. ఈ మేరకు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. వొడాఫోన్‌ ఐడియా దేశంలో అతి పెద్ద నెట్ వర్క్ సంస్థలు. అయితే ఆర్థికంగా భారీ నష్టాల నుంచి కోలుకునేందుకు, అలాటే ఏజీఆర్ బకాయిల చెల్లింపు వివాదంతో కుదేలైయ్యాయి. ఈ సంస్థలు మొబైల్‌ డేటా, కాల్‌ చార్జీలపై పలు సవరణలు చేయాలని కోరుతోంది. అందులో భాగంగా డేటా చార్జీలు ఏడు రెట్లు, కాల్‌ చార్జీలను ఏనిమిది రెట్లు పెంపు అనుమతి ఇవ్వాలని ట్రాయ్ ను కోరుతోంది. ఈ మేరకు ఓ లేఖను రాసినట్లు తెలుస్తోంది.

ఒక జీబీకి మొబైల్ డేటా చార్జీని రూ. 35 వుండాలని, అవుట్‌ గోయింగ్‌ కాల్ చార్జి నిమిషానికి 6 పైసలు నిర్ణయించాలని లేఖలో వొడాఫోన్‌ ఐడియా కోరింది. నెలవారీ కనెక్షన్ ఛార్జీ 50రూపాయలు పెంచాలని కోరుతోంది. 53,000 కోట్ల రూపాయలు ఏజీఆర్‌ బకాయిలు వోడాఫోన్‌ ఐడియా ప్రభుత్వం చెల్లించాల్సింది. ఇప్పటికే 3500 కోట్లు చెల్లించగా.. మదింపు ఆధారంగా.. 23,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఇందులో అసలు మొత్తం 7,000 కోట్ల రూపాయలు. కాగా.. బకాయిల చెల్లింపునకు మూడేళ్ల మారటోరియం గడవు ఇవ్వాలని కోరింది. ‎18 సంవత్సరాల గడుపు కోరినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. బకాయిలు చెల్లిపునకు ఏప్రిల్ 1 నుంచి ఈ రేట్లను అమలు కోరుతోంది. మార్కెట్ వాటా తగ్గడంతో ప్రభుత్వానికి ఎజిఆర్ బకాయిలు చెల్లించడంతో కొన్ని వారాలలో కంపెనీ భారీ నష్టాలతో ఉన్నాయని తెలిపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories