Solar Pump Subsidy: రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం.. సోలార్ పంప్ ఇన్‌స్టాల్ పై సబ్సిడీ..!

How To Get Subsidy For Farmers To Install Solar Pump How Much Will It Cost
x

Solar Pump Subsidy: రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం.. సోలార్ పంప్ ఇన్‌స్టాల్ పై సబ్సిడీ..!

Highlights

Solar Pump Subsidy: అన్నదాతలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రకరకాల పథకాలను ప్రవేశపెట్టింది.

Solar Pump Subsidy: అన్నదాతలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రకరకాల పథకాలను ప్రవేశపెట్టింది. సబ్సిడీ కింద ట్రాక్టర్లు, పనిముట్లు, ఎరువులు, విత్తనాలను అందిస్తోంది. అలాగే కరెంట్‌ బిల్‌ నుంచి తప్పించుకోవడానికి సబ్సిడీ సోలార్‌ పంప్‌ సెట్లను కూడా అందిస్తోంది. ఇందులో మూడువంతులు ప్రభుత్వాలు భరిస్తే ఒక వంతు రైతు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం నుంచి ఎంత సబ్సిడీ వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది తదితర వివరాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

నేటికీ భారతదేశంలో చాలామంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. భారత ప్రభుత్వం కూడా వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు వివిధ రకాల ప్రోత్సాహకాలను అందజేస్తోంది. అందులో సోలార్‌ పంప్‌ సెట్‌ కూడా ఒకటి. దీని ద్వారా విద్యుత్‌ సమస్య ఉండదు. నీటిపారుదల సులభంగా పూర్తవుతుంది. ప్రధాన్ మంత్రి కిసాన్ ఎనర్జీ సెక్యూరిటీ ఉత్థాన్ మహా అభియాన్ ఒకటి. ఈ పథకం కింద రైతులకు సోలార్ పంపులపై సబ్సిడీని అందజేస్తున్నారు. ఇందులో 30% కేంద్ర ప్రభుత్వం, మిగిలినది రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు నిబంధనలు రూపొందించారు. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు రైతులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.

లక్షల రూపాయలు ఆదా

సోలార్ పంపుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు 75 శాతం సబ్సిడీ ఇస్తున్నాయి. దీని వల్ల రైతులు ఎంతో లబ్ధి పొందుతున్నారు. రైతులకు సాగునీటి కోసం 3 హెచ్‌పి, 10 హెచ్‌పి వరకు సోలార్ పంపులను అందజేస్తున్నారు. ఈ సోలార్ పంపులపై 75 శాతం సబ్సిడీ తర్వాత మిగిలిన ఖర్చులు GSTతో సహా చెల్లించాలి. ఒక రైతు 5 HP సోక్ పంప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే వీరి మార్కెట్ ధర రూ.4,53,299 అవుతుంది. ఇందులో రైతు రూ.3,39,224 ఆదా చేసుకోవచ్చు. అంటే ఈ పంపు కేవలం రూ.1,14,075కే వస్తుంది. రాష్ట్రాల వారీగా ధరలు మారుతాయని గమనించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories