Investment Tips: రూ.10 కోట్లు సంపాదించాలా? ఈ 15x15x15 ఫార్ములాతో మీ కల నిజం చేసుకోండి!

Investment Tips: స్టాక్ మార్కెట్ గురించి లోతైన అవగాహన ఉన్నవారు నేరుగా షేర్లను ఎంచుకోవచ్చు. కానీ, మార్కెట్ రిస్క్ గురించి అంతగా తెలియని కొత్త పెట్టుబడిదారులకు మ్యూచువల్ ఫండ్స్ ఉత్తమ మార్గం అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Ganesh
Published on: 21 Feb 2026 7:38 PM IST
Investment Tips
X

Investment Tips: రూ.10 కోట్లు సంపాదించాలా? ఈ 15x15x15 ఫార్ములాతో మీ కల నిజం చేసుకోండి!

Investment Tips: స్టాక్ మార్కెట్ గురించి లోతైన అవగాహన ఉన్నవారు నేరుగా షేర్లను ఎంచుకోవచ్చు. కానీ, మార్కెట్ రిస్క్ గురించి అంతగా తెలియని కొత్త పెట్టుబడిదారులకు మ్యూచువల్ ఫండ్స్ ఉత్తమ మార్గం అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో ఉండే ఈ ఫండ్స్ ద్వారా దీర్ఘకాలంలో భారీ సంపదను సృష్టించవచ్చని పేర్కొన్నారు. సిప్ ద్వారా మీరు రూ.10 కోట్లు సంపాదించాలని ప్లాన్ చేస్తుంటే, ఎన్ని సంవత్సరాల్లో మీరు మీ కలను నిజం చేసుకోగలరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా పెట్టుబడి పెట్టడానికి సిప్ (Systematic Investment Plan) ఒక గొప్ప సాధనంగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో పెట్టుబడి పెడితే మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అని ఎదురుచూడాల్సిన పనిలేదు. ప్రతి నెల నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం వల్ల షేర్ల ధరలు తగ్గినప్పుడు ఎక్కువ యూనిట్లు, పెరిగినప్పుడు తక్కువ యూనిట్లు వస్తాయి. దీనివల్ల సగటున మీ పెట్టుబడి లాభసాటిగా మారుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నారు.

మ్యూచువల్ ఫండ్స్‌లో ఈ నియమం పాటించండి..

పెట్టుబడి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు నెలవారీ రూ.15,000 చొప్పున 15 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే, సగటున 15% వార్షిక రాబడితో భారీ మొత్తాన్ని వెనకేయవచ్చు. దీనినే 15x15x15 ఫార్ములా అంటారు. 15 ఏళ్లలో రూ.10 కోట్లు కూడబెట్టడం సాధ్యమేనా అంటే, ఒక క్రమ పద్ధతిలో పెట్టుబడి పెడితే ఇది సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం 'స్టెప్-అప్ SIP' పద్ధతిని పాటించాలని వాళ్లు సూచించారు. ప్రతి సంవత్సరం మీ ఆదాయం పెరిగే కొద్దీ, మీ SIP మొత్తాన్ని కూడా పెంచుకుంటూ పోవాలన్నారు. మీరు నెలవారీ రూ.51 వేలతో SIP ప్రారంభించి, ప్రతి ఏటా ఆ మొత్తాన్ని 20% పెంచుకుంటూ పోతే.. 15 ఏళ్ల తర్వాత (15% రాబడి అంచనాతో) మీ చేతికి రూ.10 కోట్లు వచ్చే అవకాశం ఉందన్నారు.

నిపుణులు సూచిస్తున్న కొన్ని ఫండ్స్ ఇవే..

* హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ (HDFC Flexi Cap Fund)

* నిప్పాన్ ఇండియా మల్టీక్యాప్ ఫండ్ (Nippon India Multicap Fund)

* ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ ఫండ్ (ICICI Prudential Value Fund)

* కోటక్ మల్టీక్యాప్ ఫండ్ (Kotak Multicap Fund)

* ఇన్వెస్కో ఇండియా లార్జ్ & మిడ్‌క్యాప్ ఫండ్ (Invesco India Large & Midcap Fund)

గమనిక: పెట్టుబడి పెట్టే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.

Ganesh

Ganesh

2022లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 4 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. లైఫ్ స్టైల్, బిజినెస్‌, మూవీస్, స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా సినిమా గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story