Digilocker: డిజీ లాకర్‌ను ఎలా వినియోగించాలి.. సర్టిఫికెట్స్‌ను ఎలా భద్రపరచాలి..!

How to access Digilocker check for all details
x

Digilocker: డిజీ లాకర్‌ను ఎలా వినియోగించాలి.. సర్టిఫికెట్స్‌ను ఎలా భద్రపరచాలి..!

Highlights

Digilocker: డిజీ లాకర్‌ అనేది ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌. దీనిని సులువు గా యాక్సెస్‌ చేయవచ్చు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

Digilocker: డిజీ లాకర్‌ అనేది ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌. దీనిని సులువు గా యాక్సెస్‌ చేయవచ్చు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. విలువైన పత్రలను ఇందులో సేవ్‌ చేసుకోవచ్చు. ఇంటర్నెట్‌ సాయంతో అవసరమైనప్పుడు ఎక్కడైనా వాడుకోవచ్చు. మీకు సంబంధించిన సమాచారం మొత్తం డిజిటల్‌గా సేవ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం దీని అవసరం ఏ విధంగా ఏర్పడుతోంది.. దీని ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

డిజీలాకర్‌ యాప్‌లో మీ సర్టిఫికెట్లు, పత్రాలు సురక్షితంగా దాచుకోవచ్చు. పదోతరగతి సర్టిఫికెట్‌ నుంచి ఆధార్‌, పాన్‌, రేషన్‌.. ఇలా ప్రభుత్వం జారీ చేసిన అన్ని డాక్యుమెంట్లను డిజిటల్ రూపంలో దాచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇన్సూరెన్స్‌ వంటి బాండ్‌ లను కూడా ఇందులో దాచుకోవచ్చు. మీరు రోడ్డుపై బైక్‌పై వెళ్తున్నారు ట్రాఫిక్‌ పోలీసులు ఆపి లైసెన్స్‌ అడిగారు. అప్పుడు మీ దగ్గర లైసెన్స్‌ లేకున్నా డిజిలాకర్‌ ఓపెన్‌ చేసి అందులో ఉన్న డిజిటల్ కాపీని చూపించవచ్చు. ఇలా అవసరమైన దగ్గరల్లా అవసరమైన పత్రాలను మీ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా యాక్సెస్‌ చేయవచ్చు.

ఎలా వినియోగించాలో తెలుసుకుందాం..

ముందుగా మీ ఫోన్‌లో డిజీలాకర్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. పేరు, పుట్టిన తేదీ, ఈ-మెయిల్‌, ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగా వచ్చే ఆరంకెల సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్‌ చేయాలి. తర్వాత మీ ఆధార్‌కార్డ్‌ లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ పై క్లిక్‌ చేసి అకౌంట్‌ని క్రియేట్‌ చేసుకోవాలి.తర్వాత ఆధార్‌ నంబర్‌ లేదా ఆరంకెల సెక్యూరిటీ సాయంతో సైన్‌- ఇన్‌ అవగానే మీ ఆధార్‌ కార్డు వివరాలు అందులో కనిపిస్తాయి.

పైన కుడివైపున మీ ఫొటో కనిపిస్తుంది. యాప్‌లో కింద ఉన్న సెర్చ్‌ సింబల్‌పై క్లిక్‌ చేసి మీ రాష్ట్రాన్ని ఎంచుకోగానే పదోతరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ సర్టిఫికెట్ల లిస్ట్‌ ప్రత్యక్షమవుతుంది. వాటిలో మీ ప్రాంతం, యూనివర్సిటీకి సంబంధించిన ఆప్షన్‌ను ఎంచుకొని హాల్‌టికెట్‌ నంబర్‌, ఉత్తీర్ణత పొందిన సంవత్సరం ఎంటర్‌ చేసి డాక్యుమెం ట్లు పొందొచ్చు. వీటితో పాటు పాన్‌, రేషన్‌.. లాంటి ప్రభుత్వ గుర్తింపుకార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకున్న పత్రాలు కింద ఉన్న ఇష్యూడ్‌లో దర్శనమిస్తాయి. మాన్యువల్‌గా కూడా అప్‌లోడ్‌ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories