Sukanya Samriddhi Yojana: ఈ పథకంతో 20 ఏళ్లలో లక్షలు పొందొచ్చు..కూతుళ్లకు తల్లితండ్రులిచ్చే అమూల్యమైన గిఫ్ట్ సుకన్య సమృద్ది

Sukanya Samriddhi Yojana
x

Sukanya Samriddhi Yojana: ఈ పథకంతో 20 ఏళ్లలో లక్షలు పొందొచ్చు..కూతుళ్లకు తల్లితండ్రులిచ్చే అమూల్యమైన గిఫ్ట్ సుకన్య సమృద్ది

Highlights

Sukanya Samriddhi Yojana: మీ ఆడపిల్లలకు 20 ఏళ్లలో లక్షలు సంపాదించి పెట్టాలంటే అందరికీ సాధ్యం కాదు. కానీ ఈ స్కీమ్‌లో మీరు పొదుపు చేసుకుంటే కచ్చితంగా మీ కూతురికి 21 ఏళ్లు వచ్చేసరికి 20 నుండి 30 లక్షల వరకు డబ్బులు ఇవ్వగలుగుతారు.

Sukanya Samriddhi Yojana: మీ ఆడపిల్లలకు 20 ఏళ్లలో లక్షలు సంపాదించి పెట్టాలంటే అందరికీ సాధ్యం కాదు. కానీ ఈ స్కీమ్‌లో మీరు పొదుపు చేసుకుంటే కచ్చితంగా మీ కూతురికి 21 ఏళ్లు వచ్చేసరికి 20 నుండి 30 లక్షల వరకు డబ్బులు ఇవ్వగలుగుతారు. ఈ స్కీమ్ గురించి మరికొన్ని వివరాలు..

ఇది..భారతదేశంలో ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ప్రభుత్వ పొదుపు పథకం. బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం ద్వారా దీన్ని ప్రవేశపెట్టారు. ఆడపిల్లలు పుట్టిన వెంటనే ఆమె పేరుపైన ఒక ఖాతా తెరిస్తే, ఆమెకు 21 ఏళ్లు వచ్చినప్పటికి కొన్ని లక్షల రూపాయలు అందించవచ్చు. దీనిలో పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. అదేవిధంగా, ఈ పథకం సురక్షితమైంది. ప్రభుత్వ హామీ ఇస్తుంది.

ఈ పథకంలో ప్రతి సంవత్సరం ఒకటిన్నర లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 20 నుండి 21 ఏళ్లలో ఈ డబ్బు లక్షల్లోకి మారుతుంది. మీ కుమార్తె పుట్టిన వెంటనే గనక ఈ విధంగా పెట్టుబడి పెడితే.. ఆమెకు 21ఏళ్లు వచ్చేసరికి 8.2 శాతం వడ్డీతో 70 లక్షల రూపాయలు డిపాజిట్ చేయొచ్చు. ఇందులో లక్షన్నర పన్ను మినహాయింపు ఉంటుంది.

అయితే ఇక్కడ వెయ్యి రూపాయల నుండి ఎంతైనా డబ్బులు కట్టొచ్చు. మీ చేతిలో ఎంత ఉంటే అంత డబ్బులు డిపాజిట్ చేసుకుంటూ వెళ్లినా.. లక్షల రూపాయలు మీ ఆడపిల్లలకు అందించవచ్చు.

ఈ స్కీమ్‌లో నెలకు లేదా సంవత్సరానికైనా డబ్బులు డిపాజిట్ చేయొచ్చు. ఉదాహరణకు మీరు నెలకు 12,500 డిపాజిట్ చేస్తే.. అది 15ఏళ్లకు రూ. 22,50,000 లు అవుతుంది. దీనికి 8.20 శాతం వడ్డీ రేటుతో మీరు సుమారు రూ. 46,77,578 వడ్డీని పొందుతారు. మెచ్యూరిటీ నాటికి మీకు మొత్తం రూ. 69,27,578 అందుతుంది. అంటే మొత్తానికి మీరు రూ. 70 లక్షల రూపాయలు అందుకోవచ్చు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ స్కీమ్‌లో ఎంత పెట్టుబడితే అంత ఎక్కువ రాబడి వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories