Sahara Money Back: సహారా డబ్బులు ఎవరికి వస్తున్నాయి.. ఎలాంటి పత్రాలు అవసరం..!

How Sahara Investors Can Get Their Money Back Know Full Details
x

Sahara Money Back: సహారా డబ్బులు ఎవరికి వస్తున్నాయి.. ఎలాంటి పత్రాలు అవసరం..!

Highlights

Sahara Money Back: పేద ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బుని సహారాలో పెట్టుబడి పెట్టారు. కానీ కంపెనీ దివాళతీయడంతో వారి ఆశలు గల్లంతయ్యాయి.

Sahara Money Back: పేద ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బుని సహారాలో పెట్టుబడి పెట్టారు. కానీ కంపెనీ దివాళతీయడంతో వారి ఆశలు గల్లంతయ్యాయి. ఎంతోమంది డబ్బుల కోసం సహారా కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వీరి బాధని గమనించిన మోడి ప్రభుత్వం వారికి ఆసరాగా నిలిచింది. సహారాలో ఇరుక్కున్న డబ్బుని తిరిగి చెల్లించడానికి 'సహారా రీఫండ్ పోర్టల్'ను ప్రారంభించింది. దీనిద్వారా డబ్బులు తిరిగిచెల్లిస్తామని హామినిచ్చింది. అయితే ఇందులో ఎలా అప్లై చేసుకోవాలో ఏ ఏ పత్రాలు అవసరమవుతాయో వివరంగా తెలుసుకుందాం.

పోర్టల్ నుంచి డబ్బు తిరిగి పొందడం ఎలా?

1. ఇందుకోసం ముందుగా mocrefund.crcs.gov.in. పోర్టల్‌కి వెళ్లాలి.

2. తర్వాత అవసరమైన వివరాలను అందించాలి.

3. మీ దగ్గర ఉన్న బాండ్‌ పేపర్లని, ఇతర పత్రాలని అప్‌లోడ్‌ చేయాలి.

4. రీఫండ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన పత్రాలని 30 రోజుల్లోగా ధృవీకరిస్తారు.

5. అనంతరం 15 రోజుల్లో అధికారులు దీనిపై చర్యలు తీసుకుంటారు.

6. తర్వాత SMS ద్వారా వెరిఫికేషన్ పూర్తయినట్లు ఇన్వెస్టర్లకు సమాచారం అందిస్తారు.

7. SMS వచ్చిందంటే మీ ఆన్‌లైన్ క్లెయిమ్ ఆమోదం పొందినదని అర్థం.

8. తర్వాత పెట్టుబడి మొత్తం ఖాతాకు బదిలీ అవుతుంది.

9. క్లెయిమ్‌ని ధృవీకరించిన తేదీ నుంచి 45 రోజుల తర్వాత మొత్తం బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.

10. అయితే ఇందులో దరఖాస్తు చేసుకోవడానికి నిర్దిష్ట గడువు తేదీ లేదు. అప్లై చేసుకున్నవారందరు డబ్బును తిరిగి పొందుతూనే ఉంటారు. దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

అవసరమైన పత్రాలు

పేరు, చిరునామాకు సంబంధించిన సమాచారంతో పాటు సహారాలో సభ్యత్వ సంఖ్య ఉండాలి. ఈ నెంబర్‌ పాస్‌బుక్ లేదా బాండ్ లేదా ఏదైనా డిపాజిట్ రసీదుపై ఉంటుంది. డిపాజిట్ ఖాతా సంఖ్య అంటే డబ్బు పెట్టుబడి ఖాతా సంఖ్య అని అర్థం. మొబైల్ నంబర్ గుర్తుంచుకోవాలి. ఇది ఆధార్ కార్డ్‌తో లింక్ చేయబడి ఉండాలి. అదేవిధంగా డిపాజిట్ సర్టిఫికేట్ అంటే పాస్‌బుక్ దగ్గర ఉంచుకోవాలి. క్లెయిమ్ చేయాల్సిన మొత్తం 50 వేల కంటే ఎక్కువ ఉంటే పాన్ కార్డ్ అవసరమవుతుంది.

ఎవరు ముందుగా డబ్బును తిరిగి పొందుతారు?

అన్నింటిలో మొదటిది సహారా క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌లో పెట్టుబడి పెట్టిన వారు ముందుగా డబ్బును తిరిగి పొందుతారు. ఈ పెట్టుబడి మార్చి 22, 2022లోపు పూర్తయి ఉండాలి. దీనితో పాటు సహరాయన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్, హమారా ఇండియా క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌లో డబ్బు పెట్టుబడి పెట్టిన వారు రీఫండ్ పొందుతారు. ఈ పెట్టుబడులన్నీ మార్చి 22, 2022లోపు పూర్తికావాలి. ఇది కాకుండా సహారా గ్రూప్‌కు చెందిన మరో సొసైటీ అయిన 'స్టార్స్ మల్టీపర్పస్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్' డిపాజిటర్లు మార్చి 29, 2023లోపు చేసిన డిపాజిట్ల వాపసు పొందుతారు. ప్రభుత్వం ఈ మొత్తాన్ని సెబీ ఖాతా నుంచి పెట్టుబడిదారులకు తిరిగి చెల్లిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories