Post Office: పోస్టాఫీసులో ఏ సేవలకు ఎంత రుసుం చెల్లించాలి..?

How Much to Pay for any Services at the Post Office
x

 పోస్టాఫీసులో ఏ సేవలకు ఎంత రుసుం చెల్లించాలి..? (ఫైల్ ఇమేజ్)

Highlights

Post Office: పోస్టాఫీసులో మీ డబ్బు సురక్షితం. అంతేకాదు బ్యాంకులో కంటే ఎక్కవ వడ్డీ లభిస్తుంది.

Post Office: పోస్టాఫీసులో మీ డబ్బు సురక్షితం. అంతేకాదు బ్యాంకులో కంటే ఎక్కవ వడ్డీ లభిస్తుంది. అందుకే చాలామంది ఇందులో పెట్టుబడి పెడుతారు. చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు అందరికి సరిపోయే స్కీములు ఇందులో ఉన్నాయి. అంతేకాదు కొన్ని పథకాలలో పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అయితే పోస్టాపీసులో జరిగే లావాదేవీలకు సంబంధించి ఛార్జీలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

లావాదేవీల ఛార్జీల వివరాలు..

1. డూప్లికేట్ పాస్‌బుక్ జారీ కోసం 50 రూపాయలు చెల్లించాలి.

2. పోగొట్టుకున్న లేదా పాడైపోయిన సర్టిఫికేట్‌కు బదులుగా కొత్తది జారీ చేయడానికి రూ.10 చెల్లించాలి.

3. ఖాతా స్టేట్‌మెంట్ జారీ లేదా డిపాజిట్ రసీదు కోసం రూ.20 చెల్లించాలి.

4. నామినేషన్ మార్పు లేదా రద్దు కోసం 50 రూపాయలు చెల్లించాలి.

5. ఖాతా బదిలీ కోసం 100 రూపాయలు వసూలు చేస్తారు.

6. ఖాతాను మెయింటెన్‌ చేయడానికి 100 రూపాయలు చెల్లించాలి.

7. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకి చెక్ బుక్ జారీ కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే అదనం కావాలంటే ఒక్కో చెక్ లీఫ్‌కు 2 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

8. చెక్ బౌన్స్‌ సందర్భంలో రుసుము రూ.100 చెల్లించాలి.

పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలలో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా, రికరింగ్ డిపాజిట్ ఖాతా, టైమ్ డిపాజిట్ ఖాతా, నెలవారీ ఆదాయ పథకం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి పథకం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర ఉన్నాయి. అక్టోబర్ 1 నుంచి ATM / డెబిట్ కార్డ్‌లపై వార్షిక నిర్వహణ ఛార్జీ రూ. 125, GST వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఛార్జీలు 1 అక్టోబర్ 2021 నుంచి 30 సెప్టెంబర్ 2022 కాలానికి వర్తిస్తాయి. ఇండియా పోస్ట్ తన డెబిట్ కార్డ్ కస్టమర్‌లకు పంపిన SMS హెచ్చరికల కోసం రూ.12 (GSTతో సహా) వసూలు చేస్తుంది. ఈ ఛార్జీ డెబిట్ కార్డ్ హోల్డర్‌లకు పంపబడే SMS హెచ్చరికల కోసం వార్షిక ఛార్జీ మాత్రమే.

Show Full Article
Print Article
Next Story
More Stories