Bank Accounts: ఒక వ్యక్తికి బ్యాంకు ఖాతాల పరిమితి ఎంత.. ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది..?

How Many Bank Accounts Can A Person Maintain Know The Pros And Cons Of Having Too Many
x

Bank Accounts: ఒక వ్యక్తికి బ్యాంకు ఖాతాల పరిమితి ఎంత.. ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది..?

Highlights

Bank Accounts: ఇండియాలో ఒక వ్యక్తి ఎన్ని బ్యాంకు ఖాతాలని మెయింటెన్‌ చేయవచ్చు. ఈ విషయం గురించి ఇప్పటికీ చాలామందికి క్లారిటీ లేదు.

Bank Accounts: ఇండియాలో ఒక వ్యక్తి ఎన్ని బ్యాంకు ఖాతాలని మెయింటెన్‌ చేయవచ్చు. ఈ విషయం గురించి ఇప్పటికీ చాలామందికి క్లారిటీ లేదు. వాస్తవానికి లావాదేవీలు చేయడానికి కచ్చితంగా బ్యాంకు ఖాతా అవసరం. లేదంటే సాధారణ ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కానీ కొందరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉంటారు. వీటిని వారి అవసరాల నిమిత్తం వేర్వేరు సందర్భాలలో ఓపెన్‌ చేస్తారు. కానీ తరువాత వాటిని మెయింటెన్‌ చేయడం కష్టంగా మారుతుంది. ఈ పరిస్థితిలో ఒక భారతీయుడు ఎన్ని బ్యాంకు ఖాతాలను కలిగి ఉండాలో ఈ రోజు తెలుసుకుందాం.

బ్యాంకు ఖాతా తెరవడానికి నియమాలు

దేశంలో చాలా రకాల బ్యాంకు ఖాతాలను ఓపెన్‌ చేయవచ్చు. వీటిలో సేవింగ్స్ బ్యాంక్ ఖాతా, కరెంట్ బ్యాంక్ ఖాతా, సాలరీ బ్యాంక్ ఖాతా ఉంటాయి. ప్రతి బ్యాంకు ఖాతాకు దాని సొంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ పరిస్థితిలో మీరు మీ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి కావాల్సిన బ్యాంక్ ఖాతాను ఎంచుకోవాలి. అయితే ఎన్ని బ్యాంకు ఖాతాలు ఓపెన్‌ చేయాలనేది ఇప్పటికీ చాలామందికి తెలియదు.

ఎన్ని ఖాతాలు ఓపెన్‌ చేయవచ్చు

ఒక వ్యక్తి భారతదేశంలో ఎన్ని బ్యాంకు ఖాతాలనైనా ఓపెన్‌ చేయవచ్చు. దీనికి పరిమితి అనేది లేదు. కానీ వాటన్నింటిని మెయింటెన్‌ చేయడం ముఖ్యం. భవిష్యత్‌లో ఇది చాలా కష్టంగా మారుతుంది. అందుకే వీలైనన్ని తక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉండటం అవసరం. దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి. అనవసరపు ఖర్చుల నుంచి తప్పించుకోవచ్చు.

ఎక్కువ ఖాతాలను ఉండటం వల్ల నష్టాలు

వాస్తవానికి బ్యాంకులు నిర్ణయించిన మొత్తం అంటే మినిమమ్‌ బ్యాలెన్స్‌ బ్యాంకు ఖాతాలో ఉండాలి. లేదంటే బ్యాంకులు జరిమానాలు విధిస్తాయి. దీంతోపాటు వివిధ ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. వీటిలో SMS ఛార్జీలు, ATM ఛార్జీలు మొదలైనవి ఉంటాయి. బ్యాంక్ ఖాతా ఉపయోగించకుంటే ఈ ఛార్జీలు ఖాతా నుంచి కట్‌ చేస్తారు. ఇది సిబిల్‌ స్కోరుపై ఎఫెక్ట్‌ చూపుతుంది. అందుకే తక్కువ బ్యాంకు ఖాతాలని కలిగి ఉంటే చాలా మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories