పాత నాణేలతో నిజంగానే లక్షాధికారి అవుతారా..! వీటిని ఎవరు కొంటారు..?

Can you Really become a Millionaire with Old Coins?
x

పాత నాణేలతో నిజంగానే లక్షాధికారి అవుతారా..! వీటిని ఎవరు కొంటారు..?(ఫైల్-ఫోటో)

Highlights

ఒక ప్రత్యేకమైన నాణేలు, నోట్లను మాత్రమే కొంటారు. ఎందుకంటే వాటికి ఒక గుర్తింపు ఉంటుంది. చరిత్రతో ముడిపడి ఉంటాయి.

Old Coins - International Market in India: ఇటీవల పాత నాణేలతో లక్షలు సంపాదించామని తరచూ వార్తలు వింటున్నాం. కానీ ఇది నిజమా..అబద్దమా ఎవ్వరికి తెలియదు. ఆలోచిస్తే పాత నాణేలకు ఎందుకు అంత డబ్బు చెల్లిస్తున్నారు. వాటితో ఏం చేస్తారు అనే ప్రశ్నలు తలెత్తుతాయి. నిజమే కానీ అన్ని పాత నాణేలకు డబ్బులు చెల్లించరు. ఒక ప్రత్యేకమైన నాణేలు, నోట్లను మాత్రమే కొంటారు. ఎందుకంటే వాటికి ఒక గుర్తింపు ఉంటుంది. చరిత్రతో ముడిపడి ఉంటాయి. అందుకే వాటిని కొనడానికి ముందుకువస్తారు.

అరుదైన నాణేల ధర నేరుగా డిమాండ్, సరఫరాపై ఆధారపడి ఉంటుంది. అయితే భారత్‌తో సహా చాలా దేశాలు అరుదైన వస్తువుల అమ్మకాలను నిషేధించాయి. ఈ ఏడాది జూన్‌లో ఓ నాణెం ప్రపంచం మొత్తం వార్తల్లో నిలిచింది. నిజానికి ఈ నాణెం వేలంలో దాదాపు 20 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. ఈ నాణెం పేరు డబుల్ డేగ అమెరికాలో అధికారికంగా విడుదలైన చివరి బంగారు నాణెం. 1933లో ఇది విడుదలైంది తర్వాత కొన్ని రోజులకు ప్రభుత్వం ఈ నాణేలను వెనక్కి తీసుకుంది. అయితే కొన్ని నాణేలు మనుగడలో ఉన్నప్పటికీ ఈ రోజు వాటి విలువ కోట్లలో ఉంది.

ప్రతి దేశం అరుదైన వస్తువులకు నిర్ణీత నిర్వచనాన్ని కలిగి ఉంది. సీరియస్ ఇన్వెస్టర్లు ఈ విషయాలన్నింటిపై శ్రద్ధ చూపుతారు. అటువంటి పరిస్థితిలో మీ వద్ద అరుదైన నాణెం లేదా నోటు ఉందని భావిస్తే ముందుగా ఏదైనా నాణేల చరిత్రతో దాన్ని తనిఖీ చేయాలి. మనదేశంలో 1933లో గవర్నర్ జేడబ్ల్యూ కెల్లీ సంతకంతో ముద్రించిన ఒక రూపాయి నోటుకు, 1943లో విడుదల చేసిన సీడీ దేశ్‌ముఖ్ సంతకంతో కూడిన 10 రూపాయల నోటుకు ప్రజలు అధిక ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories