Honda: యాక్టివా రిప్లేస్‌మెంట్‌.. మార్కెట్లోకి మరో కొత్త స్కూటర్ విడుదల..

Honda Launched 2022 Genio 110 Scooter in Indonesian
x

Honda: యాక్టివా రిప్లేస్‌మెంట్‌.. మార్కెట్లోకి మరో కొత్త స్కూటర్ విడుదల..

Highlights

Honda: యాక్టివా రిప్లేస్‌మెంట్‌.. మార్కెట్లోకి మరో కొత్త స్కూటర్ విడుదల..

Honda: హోండా ద్విచక్ర వాహనాల ఇండోనేషియా విభాగం జెనియో 110 స్కూటర్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త స్కూటర్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అంతేకాకుండా శక్తివంతమైన డిజైన్, ఫీచర్లు, టెక్నాలజీని అందించారు. ధర గురించి చెప్పాలంటే భారతీయ కరెన్సీలో దాదాపు 93,000 రూపాయలు. ఈ స్కూటర్‌ను చూస్తుంటే భారతదేశంలో విక్రయిస్తున్న యమహా ఫాసినో 125 హైబ్రిడ్‌గా కనిపిస్తోంది. కొత్త స్కూటర్ యూరోపియన్ డిజైన్‌లో నిర్మించారు. దీనికి చాలా భిన్నమైన LED హెడ్‌లైట్ ఇచ్చారు.

కంపెనీ ఈ హోండా స్కూటర్‌కు 12-అంగుళాల చక్రాలను అందించింది. ఇది మునుపటి 14-అంగుళాల చక్రాల కంటే కొంచెం చిన్నది. స్కూటర్ కొత్త టైర్లు చాలా వెడల్పుగా ఉంటాయి. సస్పెన్షన్‌తో పాటు బ్రేకింగ్ సెటప్ పాత మోడల్ నుంచి తీసుకున్నారు. 2022 హోండా జెనియో 110 అదే 110 సిసి ఇంజన్‌తో 8.9 పిఎస్ పవర్, 9.3 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త స్కూటర్‌లో కంపెనీ హోండా ISS అంటే ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్‌ను కూడా అందించింది.

హోండా యాక్టివాకు గట్టి ప్రత్యామ్నాయం.. ప్రస్తుతానికి హోండా జెనియో 110ని భారతదేశానికి తీసుకురావడానికి కంపెనీ ఎటువంటి సూచనను చేయలేదు. అయితే ఈ స్కూటర్ దేశంలో హోండా యాక్టివాకు బలమైన ప్రత్యామ్నాయం కావచ్చు. మీరు ప్రస్తుతం భారతదేశంలో 110 cc సెగ్మెంట్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే TVS ఇటీవల విడుదల చేసిన కొత్త జూపిటర్ చాలా కొత్త, హైటెక్ ఫీచర్‌లతో వచ్చింది. కంపెనీ ఈ స్కూటర్‌తో స్మార్ట్‌కనెక్ట్ యాప్‌ను అందించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories