Home Loan: హోమ్ లోన్ తీసుకున్నవారికి బిగ్ గుడ్ న్యూస్! వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంక్ ఆఫ్ బరోడా – మీ EMI ఇప్పుడు తగ్గనుంది

Home Loan: హోమ్ లోన్ తీసుకున్నవారికి బిగ్ గుడ్ న్యూస్! వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంక్ ఆఫ్ బరోడా – మీ EMI ఇప్పుడు తగ్గనుంది
x

Home Loan: హోమ్ లోన్ తీసుకున్నవారికి బిగ్ గుడ్ న్యూస్! వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంక్ ఆఫ్ బరోడా – మీ EMI ఇప్పుడు తగ్గనుంది

Highlights

హోమ్ లోన్ తీసుకున్నవారికి సూపర్ శుభవార్త వచ్చింది. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా తమ కస్టమర్లకు భారీ ఊరట ఇచ్చింది

హోమ్ లోన్ తీసుకున్నవారికి సూపర్ శుభవార్త వచ్చింది. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా తమ కస్టమర్లకు భారీ ఊరట ఇచ్చింది. RBI రెపో రేటు తగ్గించడంతో, బ్యాంక్ కూడా వెంటనే స్పందించి లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించినట్లు ప్రకటించింది. ఈ కొత్త రేట్లు డిసెంబర్ 6 నుంచి అమల్లోకి రానున్నాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడా కీలక ప్రకటన – BRLLR ఇప్పుడు 7.90%

ప్రస్తుతం రిటైల్ లోన్ లెండింగ్ రేట్ (BRLLR) 8.15% ఉండగా, బ్యాంక్ 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.90% గా ప్రకటించింది. దీంతో ఇప్పటికే హోమ్ లోన్ తీసుకున్న కస్టమర్లకు EMIలు గణనీయంగా తగ్గనున్నాయి.

హోమ్ లోన్ EMI ఎందుకు తగ్గుతోంది?

భారతదేశంలో ఎక్కువగా హోమ్ లోన్లు EBLR (External Benchmark-based Lending Rate) ఆధారంగా ఇస్తారు. ఈ రేటు నేరుగా RBI రెపో రేటుతో లింక్ అయి ఉంటుంది.

ఇప్పుడు RBI రెపో రేటును 5.50% నుంచి 5.25% కి తగ్గించడంతో, బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా EBLRలో తగ్గింపు చేసింది.

దీంతో హోమ్ లోన్ ఉన్నవారికి EMIలు తగ్గే అవకాశమంతా ఉంది.

ముఖ్యంగా సొంతింటి కల కోసం ఎదురు చూస్తున్న మధ్యతరగతి ప్రజలకు ఇది పెద్ద ఊరట.

తెలివైన వ్యూహం – EMIను అద్దెతో చెల్లించండి

ఒక స్మార్ట్‌ ఐడియా:

ఇల్లు కొని, దాన్ని అద్దెకు ఇవ్వండి.

ఆ అద్దెతో మీ EMI చెల్లించండి.

మీరు తక్కువ అద్దె ఉన్న ప్రదేశంలో ఉండవచ్చు.

ఇలా చేస్తే పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది, అదనంగా నెలవారీ ఖర్చు కూడా తగ్గుతుంది.

వడ్డీ రేట్లు తగ్గితే బ్యాంకులు ఇచ్చే రెండు ఆప్షన్లు

వడ్డీ తగ్గినప్పుడు మీకు రెండే ఎంపికలు ఉంటాయి:

EMI తగ్గించుకోవడం – నెలవారీ భారాన్ని తగ్గించుకోవచ్చు.

లోన్ టెన్యూర్ తగ్గించుకోవడం – మొత్తం వడ్డీపై భారీగా ఆదా అవుతుంది.

నిపుణులు ఎక్కువగా టెన్యూర్ తగ్గించుకోవడంనే బెస్ట్ ఆప్షన్‌గా సూచిస్తారు.

కొత్తగా హోమ్ లోన్ తీసుకునేవారికి కూడా లాభం

ఇప్పుడు లోన్ తీసుకోవాలనుకునేవారికి కూడా ఇదే అదృష్టం.

తగ్గిన వడ్డీ రేట్లతో కొత్తగా హోమ్ లోన్ పొందడం ఇంకా చవకగా మారింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పటికే ఈ కట్‌ను ప్రకటించగా, త్వరలో ఇతర బ్యాంకులు కూడా వడ్డీ తగ్గింపుపై ప్రకటన చేయనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories