Home Insurance: ఇంటిని, వస్తువులని కాపాడుకోవాలంటే హోమ్‌ ఇన్సూరెన్స్‌ బెస్ట్‌..!

home insurance benefits and check for all details
x

Home Insurance: ఇంటిని, వస్తువులని కాపాడుకోవాలంటే హోమ్‌ ఇన్సూరెన్స్‌ బెస్ట్‌..!

Highlights

Home Insurance: ఇంటిని, వస్తువులని కాపాడుకోవాలంటే హోమ్‌ ఇన్సూరెన్స్‌ బెస్ట్‌..!

Home Insurance: చాలామంది ఎంతో కష్టపడి సొంత ఇళ్లు కట్టుకుంటారు. ఇంటి అలంకరణ కోసం ఖరీదైన వస్తువులని కొనుగోలు చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇవన్ని నాశనం అవుతాయి. అప్పుడు తీరని నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. అందుకే ఇంటిని, ఇంట్లో ఉన్న వస్తవులని కాపాడుకోవాలంటే హోమ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి. ఇది ఇంటి నిర్మాణం నుంచి దాని కంటెంట్ వరకు ప్రతిదానికీ కవరేజీని అందిస్తుంది. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

గృహ బీమా పాలసీ వరదలు, దొంగతనం, అగ్నిప్రమాదం వంటి విషాదకరమైన పరిస్థితుల వల్ల నష్టపోయిన ఖర్చుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ముఖ్యంగా భారతదేశంలో ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి భయం ఉన్నవారు ఖచ్చితంగా గృహ బీమా పాలసీని కొనుగోలు చేస్తే మంచిది. అయితే భారతదేశంలో గృహ బీమా అనేది తప్పనిసరి కాదు. కానీ మీరు ఇంటి ప్రమాదాల నుంచి బయటపడాలంటే గృహ బీమా తప్పనిసరిగా తీసుకోవాలి.

ఉదాహరణకు అనేక ప్రాంతాలు వరదలు, భూకంపాలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటాయ. భారతదేశంలోని దాదాపు ప్రతి నగరంలో అనేక సార్లు అగ్నిప్రమాదాలు, దొంగతనాలు/దోపిడీలు జరుగుతాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి కవరేజీని పొందడానికి గృహ బీమా పథకాన్ని కొనుగోలు చేయడం మంచిది. గృహ బీమాలో రెండు రకాలు ఉన్నాయి. మొదటిదానిలో ఇంటికి ప్రత్యేక కవర్ లభిస్తుంది. రెండవ దానిలో ఇంట్లో ఉంచిన వస్తువులను కవర్ చేస్తారు. అందువల్ల రెండింటికీ వేర్వేరు పాలసీలను ఎంచుకునే బదులు సమగ్రమైన పాలసీని ఎంచుకోవడం మంచిది. ఈ రకమైన పాలసీలో మీరు ఇల్లు, గృహోపకరణాలు రెండింటికీ బీమా రక్షణ పొందుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories