బ్యాంకులు ఈ విధంగా సంపాదిస్తాయి.. మీకు తెలియకుండానే ఇందులో భాగమవుతారు..!

High Profits For Banks With Transactions Earn More In Less Time
x

బ్యాంకులు ఈ విధంగా సంపాదిస్తాయి.. మీకు తెలియకుండానే ఇందులో భాగమవుతారు..!

Highlights

Banks Transactions: బ్యాంకులకు చాలా రకాలుగా ఆదాయం వస్తుంది. ఎందుకంటే అవి లాభాల ఆధారిత నమూనాపై పని చేస్తాయి.

Banks Transactions: బ్యాంకులకు చాలా రకాలుగా ఆదాయం వస్తుంది. ఎందుకంటే అవి లాభాల ఆధారిత నమూనాపై పని చేస్తాయి. ముఖ్యంగా రుణాలు తీసుకోవడం, ఇవ్వడంపైనే ఎక్కువ దృష్టి పెడుతాయి. పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, హోమ్ లోన్, బైక్ లోన్, కార్ లోన్ మొదలైన అనేక రకాల లోన్ల కోసం ప్రతిరోజూ కాల్స్ వస్తూ ఉండటాన్ని గమనించే ఉండాలి. మీకు తెలియకుండానే చాలా సార్లు ఇందులో ఇరుక్కుంటారు. ఆటోమేటిక్‌గా బ్యాంకుకి బాధితుడిగా మారిపోతారు. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

మీరు బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో డబ్బును డిపాజిట్ చేసినప్పుడు ఫిక్స్‌డి డిపాజిట్‌పై 8 నుంచి 9 శాతం వడ్డీ రేటు, సాధారణ ఖాతాపై 4 నుంచి 5% వడ్డీ రేటు పొందుతారు. కానీ మీరు బ్యాంకు నుంచి లోన్‌ తీసుకున్నప్పుడు వడ్డీ రేటు దీని కంటే ఎక్కువగా ఉంటుంది. పర్సనల్ లోన్‌పై దాదాపు 15% వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు బ్యాంకులు హౌజింగ్‌లోన్, పర్సనల్‌లోన్‌, కారు లోన్‌ మొదలైన వాటిపై అధిక వడ్డీని వసూలు చేస్తాయి.

ఫీజు పేరుతో సంపాదన

ఇంటర్‌చేంజ్ ఫీజులు బ్యాంకులకు మరో ప్రధాన ఆదాయ వనరు. డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లావాదేవీలు చేయడానికి ఆర్థిక సంస్థలు వసూలు చేసే రుసుము ఇది. కస్టమర్ కొనుగోలు చేసి కార్డును స్వైప్ చేసినప్పుడల్లా వ్యాపారికి నిర్దిష్ట రుసుము వెళుతుంది. ఇందులో ఎక్కువ భాగం కస్టమర్ బ్యాంక్‌కు వెళుతుంది. మిగిలిన మొత్తం వ్యాపారి బ్యాంకుకు వెళుతుంది.

ఏటీఎం రుసుము

ఇతర బ్యాంకుల ATMల నుంచి నెలకు నిర్దిష్ట సంఖ్యలో ట్రాన్జాక్షన్ చేయడానికి కస్టమర్‌కు అనుమతి ఉంటుంది. ఆ పరిమితిని మించిన ట్రాన్జాక్షన్లకు నిర్ణీత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా కొన్ని బ్యాంకులు దేశీయ ఏటీఎంల నుంచి లావాదేవీల కోసం రుసుమును వసూలు చేస్తాయి. ఇందులో మినిమమ్ బ్యాలెన్స్ రుసుము, లేట్‌ ఫీజ్‌ కూడా ఉంటాయి. వీటన్నిటి ద్వారా రోజుకి బ్యాంకులకు చాలా ఆదాయం వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories