Credit Card Benefits: క్రెడిట్ కార్డులు వాడుతున్నారా ఈ ప్రయోజనాల గురించి తెలుసా?

Credit Card Benefits: క్రెడిట్ కార్డులు వాడుతున్నారా ఈ ప్రయోజనాల గురించి తెలుసా?
x
Highlights

Credit Card Benefits: క్రెడిట్ కార్డులకు సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించాలి. లేకపోతే అసలుకు వడ్డీ కలిపి ఫైన్ విధిస్తారు.

Credit Card Benefits: క్రెడిట్ కార్డులకు సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించాలి. లేకపోతే అసలుకు వడ్డీ కలిపి ఫైన్ విధిస్తారు. అయితే సకాలంలో బిల్లులు చెల్లిస్తే క్రెడిట్ కార్డులతో ఇబ్బందులుండవు. క్రెడిట్ కార్డులను జాగ్రత్తగా వాడుకుంటే ఎన్నో లాభాలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డు ఉపయోగించిన సమయంలో క్యాష్ బ్యాక్ ఆఫర్లు, లేదా క్యాష్ బ్యాక్ రివార్డులు వస్తాయి. అయితే ఇవి పాయింట్ల రూపంలో ఉంటాయి. అయితే వీటికి కొంత కాలం మాత్రమే గడువు ఉంటుంది. ఈ గడువులోపుగా వీటిని రిడీమ్ చేసుకోవాలి. షాపింగ్ లు, టికెట్ల కొనుగోలు ఇతర వాటిని క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రివార్డు పాయింట్లు ఇస్తారు.

క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లిస్తే మీ క్రెడిట్ స్కోరు పెరిగేందుకు ఇది దోహదపడుతుంది. అయితే మీరు తీసుకునే క్రెడిట్ 30 శాతానికి మించవద్దు. కార్డుకు ప్రతి ఏటా కొంత నగదును సర్వీస్ చార్జీ రూపంలో ఆయా క్రెడిట్ కార్డు నిర్వాహకులు వసూలు చేస్తారు. అయితే ప్రతి ఏటా కార్డు దారులు చేసే బిల్లు ఆధారంగా ఈ చార్జీని మినహాయిస్తారు.

బిల్లింగ్ డేట్ గురించి తెలుసుకోవాలి. బిల్లింగ్ డేట్ నుంచి 45 రోజుల సమయం ఉంటుంది. ఈ లోపున ఈ డబ్బులు చెల్లించాలి. ఒకవేళ ఈ బిల్లులు చెల్లించకపోతే ఈ బిల్లు డేట్ నుంచి 30 నుంచి 40 శాతం ఫైన్ విధిస్తారు.

బిల్లింగ్ మొత్తాన్ని ఈఎంఐగా కూడా మార్పు చేసుకోవచ్చు.లేదా బిల్లింగ్ లోని కొంత అమౌంట్ ను కూడా ఈఎంఐ రూపంలోకి మార్చుకునే అవకాశం ఉంది. విలువైన వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో ఈ మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించుకోవచ్చు.

క్రెడిట్ స్కోర్ 750 దాటితే క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు అందించేందుకు బ్యాంకులు ముందుకు వస్తాయి. క్రెడిట్ కార్డులు అందించిన బ్యాంకుల ఏజంట్లు వ్యక్తిగత రుణంతో పాటు ఇతర రుణాలు అందించేందుకు ముందుకు వస్తాయి.

మొబైల్స్, ఇతర వస్తువులు కొనుగోలు చేసే సమయంలో క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే 1 నుంచి 10 శాతం వరకు డిస్కౌంట్ అందుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories