HDFC Bank:హెచ్‌డిఎఫ్‌సి ఖాతాదారులకి బ్యాడ్‌ న్యూస్.. ఇప్పుడు లోన్‌ మరింత ప్రియం..!

HDFC Bank Raises MCLR Find Out How Expensive A Loan Will Be For You
x

HDFC Bank:హెచ్‌డిఎఫ్‌సి ఖాతాదారులకి బ్యాడ్‌ న్యూస్.. ఇప్పుడు లోన్‌ మరింత ప్రియం..!

Highlights

HDFC Bank:హెచ్‌డిఎఫ్‌సి ఖాతాదారులకి బ్యాడ్‌ న్యూస్.. ఇప్పుడు లోన్‌ మరింత ప్రియం..!

HDFC Bank: ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్లకు పెద్ద షాక్‌ ఇచ్చింది. మార్జిన్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసిఎల్‌ఆర్)ను 0.20 శాతం పెంచింది. మే తర్వాత బ్యాంకు రుణంపై వడ్డీని పెంచడం ఇది మూడోసారి. మే నుంచి HDFC మొత్తం వడ్డీ రేటు 0.80 శాతం పెరిగింది. దీనివల్ల రుణాల వడ్డీ రేట్లు గణనీయంగా పెరగనున్నాయి. HDFC బ్యాంక్ ఒక సంవత్సరం కాలానికి MCLR ఇప్పుడు 8.05 శాతంగా ఉంది. ఇది గతంలో 7.85 శాతంగా ఉంది.

బ్యాంక్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఒక రోజు MCLR వడ్డీ ఇప్పుడు 7.50 శాతం నుంచి 7.70 శాతంగా ఉంది. అదే సమయంలో మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్‌పై వడ్డీ 8.25 శాతంగా ఉంది. దీనివల్ల హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ తీసుకునే కస్టమర్లకి ఈఎంఐ మరింత భారం కానుంది.పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు మే-జూన్‌లో రెండు దశల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన పాలసీ రేటు రెపోను 0.90 శాతం పెంచింది. అప్పటి నుంచి బ్యాంకులు రుణంపై వడ్డీని నిరంతరం పెంచుతూనే ఉన్నాయి.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వెబ్‌సైట్ ప్ర‌కారం ఓవ‌ర్‌నైట్ (15 రోజుల గ‌డువు) రుణాల‌పై వ‌డ్డీరేటు 7.50 నుంచి 7.70 శాతానికి పెరుగుతుంది. నెల రోజుల టెన్యూర్ గ‌ల రుణంపై వ‌డ్డీరేటు 7.75, మూడు నెల‌ల గ‌డువు గ‌ల రుణంపై వ‌డ్డీరేటు 7.80, ఆరు నెల‌ల టెన్యూర్ గ‌ల రుణంపై 7.90 శాతం వ‌డ్డీరేటు విధించ‌నుంది. ఏడాది టెన్యూర్ రుణాల‌పై వ‌డ్డీ 8.05, రెండేండ్ల గ‌డువు రుణంపై 8.15, మూడేండ్ల గ‌డువు గల 8.25 శాతం వ‌డ్డీరేటు వ‌సూలు చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories