Credit Card: క్రెడిట్‌ కార్డు తీసుకునేటప్పుడు ఈ విషయాలు గమనించారా..!

Have you Noticed these Things while Taking a Credit Card
x

Credit Card: క్రెడిట్‌ కార్డు తీసుకునేటప్పుడు ఈ విషయాలు గమనించారా..!

Highlights

Credit Card: ఈ పరిస్థితిలో మీరు క్రెడిట్ కార్డును ఎందుకు ఉపయోగించాలి దాని అవసరం ఎంత ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Credit Card: నేటి కాలంలో చాలామంది క్రెడిట్‌కార్డుని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. అదేవిధంగా నష్టాలు కూడా ఉన్నాయి. అయితే క్రెడిట్ కార్డ్ వాడకం కొన్నిసార్లు ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తుంది. క్రెడిట్ కార్డు బిల్లు సకాలంలో చెల్లించకపోతే పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో మీరు క్రెడిట్ కార్డును ఎందుకు ఉపయోగించాలి దాని అవసరం ఎంత ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

వాస్తవానికి క్రెడిట్ కార్డ్‌ను తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా మంచిది. ప్రజలు ఆలోచించకుండా క్రెడిట్ కార్డు తీసుకుంటారు. దీని కారణంగా చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. క్రెడిట్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు మీ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అప్పుడే మీకు సరిపోయే క్రెడిట్ కార్డును ఎంచుకోవాలి.

క్రెడిట్‌ కార్డు తీసుకునేటప్పుడు గమనించాల్సిన విషయాలు

1. మీకు కచ్చితంగా క్రెడిట్‌ కార్డు అవసరమా..?

2. క్రెడిట్‌ కార్డు వల్ల మీకు రివార్డ్‌లు, క్యాష్‌బ్యాక్ లభిస్తాయా..

3.ఎక్కువగా ఏ రకమైన కొనుగోళ్లు చేయాలనుకుంటున్నారు.. వాటికి ఉపయోగపడుతుందా..

4.క్రెడిట్ కార్డ్ మీ అవసరాలకు తగిన ప్రయోజనాలతో వస్తే నిర్ణీత మొత్తాన్ని వార్షిక రుసుముగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారా?

5. మీరు సకాలంలో క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించకపోతే పెనాల్టీలని భరించగలరా.

Show Full Article
Print Article
Next Story
More Stories