NPS Rules: ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టారా.. మారిన నిబంధనలు తెలుసుకోండి..!

Have Invested in NPS Know the Changed Rules or Face Big Loss
x

NPS Rules: ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టారా.. మారిన నిబంధనలు తెలుసుకోండి..!

Highlights

NPS Rules: ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టారా.. మారిన నిబంధనలు తెలుసుకోండి..!

NPS Rules: పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ (NPS)లో పెట్టుబడి పెట్టే వ్యక్తుల ప్రయోజనాలను కాపాడేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాయి. దీని కోసం NPS నియమాలలో కొన్ని మార్పులు కూడా చేశాయి. మీరు కూడా రిటైర్మెంట్ కోసం NPSలో పెట్టుబడి పెట్టినట్లయితే కొత్త నియమాలని తెలుసుకోండి.

ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల ఉద్యోగుల కోసం ఈ-నామినేషన్ ప్రక్రియను పెన్షన్ రెగ్యులేటర్ మార్చింది. కొత్త నియమం ప్రకారం.. ఇప్పుడు నోడల్ అధికారి మీ దరఖాస్తును ఆమోదించే లేదా తిరస్కరించే హక్కును కలిగి ఉంటారు. అయితే నోడల్ అధికారి 30 రోజుల పాటు మీ ఈ-నామినేషన్ దరఖాస్తుపై ఎటువంటి చర్య తీసుకోకపోతే మీ దరఖాస్తు స్వయంచాలకంగా సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (CRA)కి వెళ్లి ఆమోదం పొందుతుంది. ఈ నియమం అక్టోబర్ 1, 2022 నుంచి అమలులోకి వచ్చింది.

అలాగే ఇప్పుడు మెచ్యూరిటీపై యాన్యుటీ కోసం ప్రత్యేక ఫారమ్ తీసుకోవలసిన అవసరం లేదు. NPSలో పెట్టుబడిని సులభతరం చేసే లక్ష్యంతో RRDAI క్రమం తప్పకుండా నిబంధనలను సడలిస్తూనే ఉంది. ప్రతి పెన్షనర్ పెన్షన్ కొనసాగింపు కోసం ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి. ఇప్పుడు జీవన్ ప్రమాణ్ సేవను ఉపయోగించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. దీంతో పాటు బీమా రెగ్యులేటర్ ఆధార్-ధృవీకరించబడిన లైఫ్ సర్టిఫికేట్‌ను స్వీకరించాలని బీమాదారులందరినీ కోరింది. అలాగే PFRDA జారీ చేసిన ఆర్డర్ ప్రకారం ఆగస్ట్ 3, 2022 నుంచి టైర్ 2 నగరాల్లోని NPS ఖాతాదారులు క్రెడిట్ కార్డ్‌ల ద్వారా NPSకి సహకరించలేరు. కానీ టైర్ 1 నగరాల్లోని ఖాతాదారులకు ఈ సదుపాయం అందుబాటులో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories