Credit Card: క్రెడిట్‌ కార్డు ఎవరైనా దొంగిలించారా.. వెంటనే ఈ పని చేయకపోతే భారీ నష్టం..!

Has Anyone Stolen the Credit Card if this is not Done Immediately the Loss will be Huge
x

Credit Card: క్రెడిట్‌ కార్డు ఎవరైనా దొంగిలించారా.. వెంటనే ఈ పని చేయకపోతే భారీ నష్టం..!

Highlights

Credit Card: ఈ రోజులలో క్రెడిట్ కార్డ్ వినియోగం నిరంతరం పెరుగుతోంది.

Credit Card: ఈ రోజులలో క్రెడిట్ కార్డ్ వినియోగం నిరంతరం పెరుగుతోంది. ఎందుకంటే క్రెడిట్ కార్డుతో చెల్లింపులు చేయడం చాలా సులభం. అంతేకాదు వీటిని ఉపయోగించడం వల్ల చాలా ఆఫర్‌లను కూడా పొందుతారు. అయితే క్రెడిట్ కార్డ్‌ వాడేటప్పుడు దానికి కొంత క్రెడిట్ పరిమితిని కలిగి ఉంటారు. దీనిని ఉపయోగించి మీరు చెల్లింపులు చేయవచ్చు. తర్వాత క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లించవచ్చు. అయితే క్రెడిట్ కార్డ్ పోయినా లేదా దొంగిలించబడినా క్రెడిట్ కార్డ్ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

1. కార్డును బ్లాక్ చేయండి..

క్రెడిట్ కార్డ్ పోయినా లేదా దొంగిలించబడినా వెంటనే క్రెడిట్ కార్డ్ తీసుకున్న బ్యాంక్ లేదా సంస్థకు తెలియజేయాలి. కార్డుని బ్లాక్‌ చేయమని చెప్పాలి. తర్వాత డూప్లికేట్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి.

2. FIR చేయాలి..

బ్యాంకుకు సమాచారం అందించిన తర్వాత క్రెడిట్ కార్డ్ పోయిందని FIR చేయాలి. దీనివల్ల మీ క్రెడిట్ కార్డ్ దుర్వినియోగమైతే దానికి మీరు బాధ్యత వహించరని అర్థం. దీంతో పాటు చట్టపరమైన రుజువును కలిగి ఉంటారు. నకిలీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించవచ్చు.

3. క్రెడిట్ బ్యూరోని సంప్రదించాలి..

మీరు మీ క్రెడిట్ బ్యూరోని సంప్రదించి క్రెడిట్ కార్డ్ పోయిన విషయం తెలియజేయాలి. ఎవరైనా కార్డును దుర్వినియోగం చేసినట్లయితే మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడకుండా ఉంటుంది. మీరు క్రెడిట్ స్టేటస్‌ని కూడా చెక్‌ చేయాలి. ఏదైనా తప్పు సమాచారాన్ని కనుగొంటే క్రెడిట్ బ్యూరోలకు తెలియజేయాలి.

4. క్రెడిట్‌ కార్డు స్టేటస్‌ చెక్‌

మీరు క్రెడిట్ కార్డ్ పోయిన విషయం గురించి బ్యాంక్‌కి తెలియజేసినప్పటికీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ని నిశితంగా గమనించాలి. ఏదైనా లావాదేవీ అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే బ్యాంక్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories