GST Relief: మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ పన్ను రిలీఫ్.. భారీగా రేట్లు తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే..!

GST Relief For Middle Class Soon Cheaper Toothpaste, Utensils, Clothes, Shoes
x

GST Relief: మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ పన్ను రిలీఫ్.. భారీగా రేట్లు తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే..!

Highlights

GST Relief: మధ్య తరగతి ప్రజలపై జీఎస్టీ భారం అవుతుందని ఇప్పుడు కొన్ని వస్తువులపై జీఎస్టీ తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంది.

GST Relief: మధ్య తరగతి ప్రజలపై జీఎస్టీ భారం అవుతుందని ఇప్పుడు కొన్ని వస్తువులపై జీఎస్టీ తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. దీనికి సంబంధించి వస్తువుల ధరలను అధిక జీఎస్టీ నుంచి తక్కువ జీఎస్టీకి మార్చడంపై కసరత్తు జరుగుతుంది. వివరాల్లోకి వెళితే..

ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు మొదటిసారి మోదీ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన తర్వాత వ్యాట్ స్థానంలో జీఎస్టీని తీసుకొచ్చారు. అయితే మధ్యతరగతి వాళ్లు ఈజీఎస్టీ భారంగా మారిందని ఇప్పుడు పన్ను రేట్లలో తగ్గింపును తీసుకొస్తున్నట్టు సమాచారం. ఎక్కువగా జీఎస్టీ ఉన్న వస్తువులను తక్కువ జీఎస్టీగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.

ఈ సారి బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని పలు మార్పులను చేసింది.. కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలపై జీఎస్టీ భారాన్ని తగ్గించే ప్లాన్ చేస్తుంది. ఇందులో 12 శాతం కింద ఉన్న అనేక వస్తువులపై పన్నును 5శాతానికి తగ్గించనున్నట్లు తెలుస్తోంది.

అయితే అన్ని రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గదు. టూత్ పేస్ట్, గొడుగులు, టూత్ పౌడర్, ఫ్రెషర్ కుక్కర్లు, కుట్టు మిషన్లు, వంట సామాగ్రి, ఎలక్ట్రిక్ గీజర్లు, ఇస్త్రీ పెట్టెలు, చిన్న వాషింగ్ మెషిన్లు, రెడీమేడ్ బట్టలు, సైకిళ్లు, వ్యాక్సిన్లు, సిరామిక్ టైల్స్, వ్యవసాయ ఉపకరణాలు వంటి పలు మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే వస్తువులపై పన్నులు తగ్గిస్తున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories