మొబైల్ ఫోన్ వినియోగదారులకు జీఎస్‌టీ షాక్..

మొబైల్ ఫోన్ వినియోగదారులకు జీఎస్‌టీ షాక్..
x
Mobile phone File Photo
Highlights

మొబైల్ వినియోగదారులకు జీఎస్టీ రూపంలో భారీ షాక్ తగిలింది. కొత్తగా మొబైల్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి జీఎస్‌టీ కౌన్సిల్ సుంకం పెంపుకు ఆమోదం తెలిపింది.

మొబైల్ వినియోగదారులకు జీఎస్టీ రూపంలో భారీ షాక్ తగిలింది. కొత్తగా మొబైల్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి జీఎస్‌టీ కౌన్సిల్ సుంకం పెంపుకు ఆమోదం తెలిపింది. శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో మొబైల్ ఫోన్ల 12శాతం ఉన్న జీఎస్టీ రేటును 18 శాతానికి పెంచాలని నిర్ణయించింది.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌‌ను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోంది. ప్రస్తుతం వీటిపై 5 శాతం టాక్స్ ఉంది. అయితే ఏప్రిల్ 1 నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. 30 జూన్ 2020 వరకు జీఎస్‌టీఆర్ 9, జీఎస్‌టీఆర్‌ 9 సీ గడువు ఈ నెల ఆఖరు వరకు పొడిగించింది. అలాగే వార్షిక టర్నోవర్ రూ.5 కోట్లకు పైగా ఉన్న చెల్లింపుదారులకు ఇది తప్పనిసరి.

ప్రభుత్వ నిర్ణయం వినియోగదారులతోపాటు కంపెనీలకు కూడా మంచిదికాదని మొబైల్ హ్యాండ్‌సెట్‌, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ సంస్థ లేఖలో పేర్కొంది. మొబైల్ ఫోన్ల జీఎస్టీ రేటు 18 శాతానికి పెంచడం ‎ఇది సమయం కాదని విమర్శించింది. మొబైల్ ఫోన్‌లు, విడి భాగాలు ఇన్‌పుట్‌లపై జీఎస్టీ ద్వారా ఇబ్బందుల్లో పడిన సంస్థపై పడుతోందని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మొహింద్రూ పేర్కొన్నారు. మొబైల్‌ ఫోన్లతోపాటు, లెదర్‌, ఫుట్‌వేర్‌ ఇతర ప్రొడక్టులపై కూడా జీఎస్‌టీ పెరగనుందని అంచనా వేసిన విషయం తెలిసిందే.

అంతకుముందు టర్నోవర్ పరిమితి 2 కోట్ల రూపాయలు ఉండగా.. మార్చి 31 వరకు గడువు ఉంది. జీఎస్‌టీ నెట్‌వర్క్‌లోని సమస్యల్ని 2021 జనవరి నాటికి పరిష‍్కరిస్తామని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని తెలిపారు. ఇందుకోసం ఒక నిర్దిష్ట రోడ్‌మ్యాప్‌తో (చైనా హార్డ్‌వేర్ ద్వారా) వ్యవస్థను సరిదిద్దాలని ప్రతిపాదించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories