GST 2.O: జీఎస్టీ 2.0 ప్రారంభం సామాన్యులకు ఊరట.. వస్తువుల ధరల్లో పెద్ద మార్పులు

GST 2.O: జీఎస్టీ 2.0 ప్రారంభం సామాన్యులకు ఊరట.. వస్తువుల ధరల్లో పెద్ద మార్పులు
x

GST 2.O: జీఎస్టీ 2.0 ప్రారంభం సామాన్యులకు ఊరట.. వస్తువుల ధరల్లో పెద్ద మార్పులు

Highlights

నేటి అర్థరాత్రి నుంచి జీఎస్టీ 2.0 దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. కొత్త శ్లాబ్‌లతో వస్తువుల ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. సెప్టెంబర్ 3న జరిగిన కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ప్రకారం ఇకపై ప్రధానంగా రెండు పన్ను స్లాబులు మాత్రమే ఉంటాయి – 5 శాతం మరియు 18 శాతం. అదనంగా, విలాస వస్తువులు, సిన్ గూడ్స్‌పై 40 శాతం ప్రత్యేక పన్ను విధించనున్నారు.

ఆరోగ్య బీమా, జీవిత బీమా, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు, యాంటీ-క్యాన్సర్ మందులు, గ్లూకోమీటర్లు, థర్మామీటర్లపై పన్ను పూర్తిగా రద్దు చేశారు. పాలు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, బియ్యం, టాయిలెట్రీస్ వంటి నిత్యావసరాలు 5% స్లాబ్‌లోకి వస్తాయి. టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు, చిన్న కార్లు, 350cc లోపు బైకులు 18% స్లాబ్‌లో ఉంటాయి. సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలా, పెద్ద కార్లు, ప్రైవేట్ హెలికాప్టర్లు, యాట్స్ వంటి విలాస వస్తువులు 40% స్లాబ్‌లోకి వస్తాయి.

విద్యా సామగ్రి విషయంలో కూడా పెద్ద మార్పులు చేశారు. పెన్సిల్స్, క్రేయాన్లు, డ్రాయింగ్ చాక్స్‌లను పన్ను నుంచి మినహాయించారు. అయితే బాల్‌పాయింట్ పెన్నులు, స్కూల్ బ్యాగులు, ముద్రించిన పుస్తకాలు 18% స్లాబ్‌లోకి మార్చారు. రైతులకు ఊరట కల్పిస్తూ వ్యవసాయ పరికరాలపై పన్నును 12% నుంచి 5%కి తగ్గించారు.

కేంద్రం అంచనా ప్రకారం ఈ సంస్కరణల వల్ల దాదాపు ₹48,000 కోట్ల వరకు రెవెన్యూ లోటు ఉంటుందని చెబుతున్నా, ప్రజల చేతిలో డబ్బు మిగలడం వల్ల వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థ బలపడుతుందనే విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

జీఎస్టీ 2.0 ద్వారా పన్ను వ్యవస్థ మరింత సులభం, పారదర్శకం అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సామాన్య వస్తువులు చౌక అవుతాయి. అయితే లగ్జరీ ఉత్పత్తులపై మాత్రం భారి పన్నులు అమలు కానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories