Financial Assistance: వివాహం తర్వాత జంటలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది.. కానీ ఇది వీరికి మాత్రమే వర్తిస్తుంది..!

Governments Provide Financial Assistance To Inter-Caste Marriages Many People Do Not Know About This Scheme
x

Financial Assistance: వివాహం తర్వాత జంటలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది.. కానీ ఇది వీరికి మాత్రమే వర్తిస్తుంది..!

Highlights

Financial Assistance: వివాహం అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే తంతు. దీనికోసం చాలామంది చాలా ఖర్చు చేస్తారు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షలాది పెళ్లిళ్లు జరుగుతున్నాయి.

Financial Assistance: వివాహం అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే తంతు. దీనికోసం చాలామంది చాలా ఖర్చు చేస్తారు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షలాది పెళ్లిళ్లు జరుగుతున్నాయి. వీటికోసం చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. వివాహ ఊరేగింపు, డెకరేషన్‌, ఫొటో షూట్, టెంట్‌హౌజ్‌ ఇతర వాటిని కొన్ని నెలల ముందుగానే బుక్ చేసకోవాల్సి ఉంటుంది. అందుకే పెళ్లిళ్లకు చాలా ఖర్చు అవుతుంది. నేడు సాధారణ వివాహానికి దాదాపు రూ.10 నుంచి 15 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ పరిస్థితిలో చాలా మంది దీని కోసం రుణం తీసుకోవాల్సి వస్తుంది. లేదా స్నేహితులు, బంధువుల నుంచి అప్పులు చేయాల్సి ఉంటుంది. అయితే దేశవ్యాప్తంగా కొన్ని పథకాలు ఉన్నాయి. వీటి ప్రకారం పెళ్లి తర్వాత ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. వాటి గురించి తెలుసుకుందాం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు

వాస్తవానికి కులాంతర వివాహాలను ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఇందులో పెళ్లిళ్లు చేసుకునే జంటకు డబ్బు వస్తుంది. అంటే మీరు వేరే రాష్ట్రంలో వేరే కులానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నట్లయితే మీరు ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. అంటే అగ్రవర్ణాల వారు దళిత కుటుంబంలో పెళ్లి చేసుకుంటే కులాంతర వివాహ పథకం కింద డబ్బు పొందవచ్చు.

డా.అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా దళిత, అగ్రవర్ణ వ్యక్తుల మధ్య పెళ్లి జరిగితే సుమారు రూ.2.5 లక్షలు అందజేస్తారు. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఈ పథకాన్ని 2013లో ప్రారంభించారు. ఆ తర్వాత ఇలాంటి వివాహాలు చేసుకునే వ్యక్తులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కులాంతర వివాహాల కోసం ఇలాంటి పథకాలను అమలు చేస్తున్నాయి. దళితుడిని పెళ్లి చేసుకుంటే రాజస్థాన్ ప్రభుత్వం రూ. 5 లక్షల వరకు ఇస్తుండగా, యూపీ ప్రభుత్వం రూ. 50,000 నుంచి రూ. 2 లక్షల వరకు ఇస్తుంది. ఇది కాకుండా హర్యానా ప్రభుత్వం కూడా రూ. 2.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే పథకాన్ని అమలు చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories