Google Doppl app: ఆన్‌లైన్‌లో బట్టలు కొనేవారికి కొత్త గూగుల్ యాప్ డోప్ల్

Google Doppl app
x

Google Doppl app: ఆన్‌లైన్‌లో బట్టలు కొనేవారికి కొత్త గూగుల్ యాప్ డోప్ల్

Highlights

Google Doppl app: ఆన్‌లైన్‌లో మీరు బట్టలు ఎక్కువగా కొంటుంటారా? అయితే ఆన్‌లైన్‌లో బట్టలు కొనేవారికి గూగులు ఇప్పుడు సరికొత్త యాప్‌ని తీసుకొచ్చింది.

Google Doppl app: ఆన్‌లైన్‌లో మీరు బట్టలు ఎక్కువగా కొంటుంటారా? అయితే ఆన్‌లైన్‌లో బట్టలు కొనేవారికి గూగులు ఇప్పుడు సరికొత్త యాప్‌ని తీసుకొచ్చింది. దానిపేరే డోప్ల్(Doppl). అయితే ఆన్ లైన్ కోసం చాలానే యాప్స్ ఉన్నాయి కదా. దీని స్పెషాలిటీ ఏంటనే కదా మీ డౌట్. అవును కాస్త స్పెషాలిటీతోనే ఆ యాప్ వచ్చింది. మీకు నచ్చిన బట్టలు ఏవైనా సరే ఒక ఫోటో తీసుకుని ఈ యాప్‌లో అప్‌లోడ్ చేస్తే చాలు వెరైటీ డ్రెస్సులు మీ ముందుకు వస్తాయి. ఇదేకాదు... ఈ యాప్‌లో ఇంకా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి.

ట్రయల్ రూమ్‌కి బదులు ఏఐ

డోప్ల్ యాప్‌ని డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత అందులో ముందు మీ పూర్తి ఫోటోను అప్ లోడ్ చేయాలి. ఆ తర్వాత మీరు ఏ డ్రెస్సు కావాలనుకుంటున్నారో ఆ డ్రెస్‌ ఫోటోని కూడా అప్ లోడ్ చేయాలి. అప్పుడు ఏఐ సాయంతో మీరు ఆ డ్రెస్సు వేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తుంది. అంతేకాదు ఇక్కడ ఒక స్పెషల్ వీడియో కూడా మీకు కనిపిస్తుంది. అంటే మీరు షాపింగ్‌లకు వెళ్లినప్పుడు ట్రయిల్‌ రూమ్‌లో డ్రెస్సు వేసుకుని చూస్తారు. అచ్చం అలాగే ఇంట్లో ఉండి మీకు ఆ డ్రస్సు వేసుకుంటే ఎలా ఉంటుందో ఏఐ ద్వారా తెలిసిపోతుంది. అప్పుడు చక్కగా ఆ డ్రెస్సు ఆర్డర్ చేయొచ్చు. అంతేకాదు ఏఐ ద్వారా వచ్చిన మీ పిక్చర్స్ అలాగే వీడియోలను మీరు సేవ్ చేసుకొని ఇతరులకు పంపి సెకెండ్ ఒపీనియన్ కూడా అడిగే అవకాశం ఈ యాప్ మీకు కల్పిస్తుంది.

ఈ యాప్ భలే ఉంది కదూ. అయితే ఈ యాప్ ఇంకా ఇప్పుడు అందుబాటులోకి రాలేదు. త్వరలో రానుంది. అయితే ఇది ఇప్పుడ గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌‌లో అందుబాటులో ఉంది. అయితే ఇది కేవలం అమెరికా ప్రజలకు మాత్రమే. ఇండియాలో రావాలంటే మరికొన్ని రోజులు సమయం పడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories