Sahara Investors: సహారాలో పెట్టుబడిదారులకి గుడ్‌న్యూస్‌.. డబ్బులు తిరిగి చెల్లిస్తున్నారు..!

Good News for Sahara investors 4 Crore People are Being Refunded
x

Sahara Investors: సహారాలో పెట్టుబడిదారులకి గుడ్‌న్యూస్‌.. డబ్బులు తిరిగి చెల్లిస్తున్నారు..!

Highlights

Sahara Investors: సహారాలో పెట్టుబడి పెట్టి గడువు తీరాక డబ్బుల కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకి ఇది శుభవార్తని చెప్పాలి.

Sahara Investors: సహారాలో పెట్టుబడి పెట్టి గడువు తీరాక డబ్బుల కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకి ఇది శుభవార్తని చెప్పాలి. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సహారా ఇండియా పెట్టుబడి దారులకు డబ్బును అందిస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఒక పోర్టల్ (సహారా వాపసు పోర్టల్) ప్రారంభించింది. దీని ద్వారా డబ్బును తిరిగి పొందవచ్చు. ఇందులో స్వయంగా అప్లై చేసుకోవచ్చు. ఏజెంట్ అవసరం ఉండదు. ఇంట్లో కూర్చొని మొబైల్ లేదా ల్యాప్‌టాప్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అది ఎలాగో ఈరోజు తెలుసుకుందాం.

4 కోట్ల పెట్టుబడిదారులు

4 కోట్ల మంది పెట్టుబడిదారులకు డబ్బు తిరిగి చెల్లిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. అయితే మెచ్యూరిటీ పూర్తయిన పెట్టుబడిదారులకు మాత్రమే డబ్బు తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. మొదటి దశలో రూ.10,000 అందిస్తామన్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిన వారికి కొద్ది కొద్దిగా చెల్లిస్తామని చెప్పారు. పెట్టుబడి మొత్తంలో మొదటి దశలో కేవలం రూ.10,000 మాత్రమే తిరిగి చెల్లిస్తారు. ఈ విధంగా ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయల నిధిని పంపిణీ చేస్తుంది.

రీఫండ్ డబ్బును ఎలా పొందాలి..?

>> సహారా రీఫండ్ పొందడానికి ముందుగా అధికారిక లింక్ https://cooperation.gov.in పై క్లిక్ చేయాలి.

>> తర్వాత వెబ్‌సైట్‌లో మిమ్మల్ని మీరు నమోదు చేసుకోవాలి.

>> రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ నంబర్ అవసరం. అలాగే ఆధార్ మొబైల్ నంబర్‌తో లింక్ చేసి ఉండాలి.

>> ఆధార్ నంబర్‌ను ఎంటర్‌ చేసిన తర్వాత మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని అడిగిన దగ్గర నమోదు చేయాలి.

>> తర్వాత ఒక ఫారమ్ ఓపెన్‌ అవుతుంది.

>> దీనిని డౌన్‌లోడ్ చేసి నింపి స్కాన్ చేసి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.

>> తర్వాత మీరు ఇచ్చిన సమాచారం చెక్‌ చేస్తారు. ఆ తర్వాత డబ్బు ఖాతాలో జమ చేస్తారు.

ఈ పత్రాలు అవసరం

>> సహారాలో పెట్టుబడి సభ్యత్వ సంఖ్య ఉండాలి.

>> ఇది కాకుండా డిపాజిట్ ఖాతా సంఖ్య అవసరం.

>> మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయాలి.

>> డిపాజిట్ హోల్డర్ పాస్‌బుక్ అవసరం.

>> మొత్తం 50,000 కంటే ఎక్కువ ఉంటే పాన్ కార్డ్ నంబర్ అవసరం.

Show Full Article
Print Article
Next Story
More Stories