EPFO: పీఎఫ్ పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇంటివద్దే లైఫ్ సర్టిఫికెట్..!!

EPFO: పీఎఫ్ పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇంటివద్దే లైఫ్ సర్టిఫికెట్..!!
x
Highlights

EPFO: పీఎఫ్ పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇంటివద్దే లైఫ్ సర్టిఫికెట్..!!

EPFO: పీఎఫ్ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. ఇప్పటివరకు ప్రతి ఏడాది డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు బ్యాంకులు, ఈపీఎఫ్ఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు, దూర ప్రాంతాల్లో నివసించే పెన్షనర్లు ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) సహకారంతో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సేవలను పూర్తిగా ఉచితంగా ఇంటి వద్దే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త విధానం ద్వారా ఇకపై పెన్షనర్లు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం ఉండదు. మీ ఇంటికి దగ్గరలోని పోస్టాఫీస్‌కు చెందిన పోస్ట్‌మ్యాన్ లేదా డాక్ సేవక్ నేరుగా మీ ఇంటికే వచ్చి లైఫ్ సర్టిఫికెట్ ప్రక్రియను పూర్తి చేస్తారు.

ఈ సేవలో భాగంగా పెన్షనర్ వద్ద ఉన్న ఆధార్ కార్డ్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO) వివరాలను పరిశీలిస్తారు. అనంతరం ఫేస్ అథెంటికేషన్ లేదా బయోమెట్రిక్ విధానంలో లైఫ్ సర్టిఫికెట్‌ను అక్కడికక్కడే డిజిటల్‌గా అప్‌లోడ్ చేస్తారు. దీనివల్ల సాంకేతిక పరిజ్ఞానం లేని వారు కూడా ఎలాంటి ఆందోళన లేకుండా సర్టిఫికెట్ సమర్పించగలుగుతారు.

గతంలో ఈ డోర్‌స్టెప్ సేవలకు కొంత మొత్తంలో ఫీజు వసూలు చేసేవారు. అయితే తాజా నిర్ణయంతో పెన్షనర్లపై ఎలాంటి భారం ఉండదు. ఈ సేవకు సంబంధించిన ఖర్చును ఈపీఎఫ్ఓ నేరుగా పోస్టల్ శాఖకు చెల్లిస్తుంది. చాలా కాలంగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించక పెన్షన్ నిలిచిపోయిన వారికి ఈ విధానంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

మొత్తానికి, ఇంటి వద్దే లైఫ్ సర్టిఫికెట్ సౌకర్యం అమలులోకి రావడం ద్వారా పీఎఫ్ పెన్షనర్లకు సమయం, డబ్బు, శ్రమ అన్నింటిలోనూ పెద్ద ఉపశమనం లభించనుంది

Show Full Article
Print Article
Next Story
More Stories