LIC IPO: ఎల్ఐసీ ఖాతాదారులకి గుడ్‌న్యూస్‌.. ఈ అవకాశం మీ కోసమే..!

Good News for LIC clients lic ipo to stay open on Saturday for Retail Investors | Business News
x

LIC IPO: ఎల్ఐసీ ఖాతాదారులకి గుడ్‌న్యూస్‌.. ఈ అవకాశం మీ కోసమే..!

Highlights

LIC IPO: మీరు LIC IPOని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఈ వార్త మీకోసమే...

LIC IPO: మీరు LIC IPOని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఈ వార్త మీకోసమే. ప్రభుత్వం ఒక రూల్‌ని మార్చి గొప్ప వార్త అందించింది. ఈ దేశం అతిపెద్ద IPO మే 4 నుంచి మే 9 వరకు సాధారణ పెట్టుబడిదారుల కోసం అందుబాటులో ఉంటుంది. ఎల్‌ఐసీ ఐపీవోని కొనుగోలు చేయడానికి పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన వస్తుంది. మొదటి కొన్ని గంటల్లో ఈ IPO 33 శాతం సభ్యత్వాన్ని పొందడం విశేషం.

శని, ఆదివారాలు మార్కెట్‌కి సెలవు కావడంతో సాధారణ ఇన్వెస్టర్లు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అయితే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నోటిఫికేషన్ ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లు శనివారం కూడా ఐపిఓ సభ్యత్వం తీసుకోగలరు. ఈ మార్పు తర్వాత మీరు 5 రోజుల పాటు ఎల్‌ఐసీ ఐపీవో సభ్యత్వం తీసుకునే అవకాశం ఉంటుంది. బుధవారం ఉదయం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఓ) ప్రారంభించింది.

LIC IPO ధర రూ. 902 నుంచి 949గా నిర్ణయించింది. ఇందులో ఎల్‌ఐసికి చెందిన ప్రస్తుత పాలసీదారులు, ఉద్యోగుల కోసం కొన్ని షేర్లు రిజర్వ్ చేశారు. రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.45 తగ్గింపు, పాలసీ హోల్డర్లకు ఒక్కో షేరుపై రూ.60 తగ్గింపు ఉంటుంది. LIC 3.5 శాతం షేర్లను విక్రయించడం ద్వారా 21,000 కోట్ల రూపాయలను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. LIC IPO మే 9న ముగుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories