Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో మరిన్ని బెనిఫిట్స్‌..!

Good News For Bank Employees Soon They Will Work Five Days A Week And Get 15 Percent Increment
x

Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో మరిన్ని బెనిఫిట్స్‌..!

Highlights

Bank Employees: యువత వారానికి 70 గంటలు పని చేయాలని ఇటీవల ఇన్ఫోసిస్ యజమాని నారాయణ మూర్తి అన్నారు.

Bank Employees: యువత వారానికి 70 గంటలు పని చేయాలని ఇటీవల ఇన్ఫోసిస్ యజమాని నారాయణ మూర్తి అన్నారు. తర్వాత ఆయన ప్రకటనపై సోషల్ మీడియా నుంచి కార్పొరేట్ ఆఫీసుల వరకు చర్చ మొదలైంది. 70 గంటల పని చర్చల మధ్య బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త రానుంది. వాస్తవానికి బ్యాంకు ఉద్యోగులకు వారానికి 5 రోజులు, 2 రోజులు సెలవులు, జీతంలో 15 శాతం పెంచడానికి ఒక ప్రతిపాదన చేశారు. ఇది ఆమోదం పొందినట్లయితే బ్యాంకు ఉద్యోగులు త్వరలో వాటి ప్రయోజనాలను పొందుతారు.

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంటే IBA బ్యాంకు ఉద్యోగుల కోసం ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. IBA 15% పెంపును ప్రతిపాదించింది అయితే యూనియన్లు ఇతర మార్పులతో పాటు ఎక్కువ పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ వంటి కొన్ని బ్యాంకులు జీతం పెంపు కోసం కేటాయింపులను ప్రారంభించాయి.

జీతాలు పెంచాలనే డిమాండ్‌

IBA జీతంలో పెరుగుదల, బ్యాంకు ఉద్యోగులకు 5 రోజుల పనిని సూచించింది. ఎందుకంటే ఉద్యోగుల పనితీరు వల్ల బ్యాంకులు లాభాల్లో పెరుగుదలను చూశాయి. కోవిడ్ సమయంలో ఉద్యోగులు పని చేయడం, ల్యాండర్లను తిరిగి ట్రాక్‌లోకి తీసుకువచ్చారు. ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే వారికి మెరుగైన పరిహారం లభిస్తుంది. అయితే చర్చలను ఆర్థిక మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. బ్యాంకు ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అంతకంటే ముందే జీతాల పెంపు ఖరారు కావచ్చని ఉద్యోగులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories