బంగారం దిగివస్తోంది!వెండి ఇంకా పైచూపులే!!

బంగారం దిగివస్తోంది!వెండి ఇంకా పైచూపులే!!
x
Highlights

కొద్దిగా డిమాండ్ తగ్గడంతో బంగారం ధరలు దిగి వచ్చాయి. అయితే, వెండి ధరలు మాత్రం ఇంకా పై చూపే చూస్తున్నాయి. అంతర్జాతీయంగా బంగారం, వెండి దారులు రెండూ తగ్గినప్పటికీ, దేశీయంగా బంగారం ధర మాత్రమే తగ్గింది.

విపరీతంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయి. దేశీయంగా డిమాండ్ పడిపోవడంతో పసిడి ధర పై ప్రతికూల ప్రభావం చూపించడంతో ధరల్లో తగ్గుదల ఏర్పడిందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయల తగ్గుదలతో రూ.39,910రూపాయల వద్ద ఉంది. అదేవిధంగా 10 గ్రామల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 120 రూపాయలు తగ్గి, రూ.36,590 రూపాయలకు దిగింది.

బంగారం ధర తగ్గుముఖం పట్టినా వెండి మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర 200 రూపాయలు పెరిగి 53,200 రూపాయలకు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ పెరగడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. . విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.

ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 రూపాయల తగ్గుదలతో 38,600 రూపాయలకు దిగొచ్చింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయలు తగ్గుదలతో 37,400 రూపాయలకు తగ్గింది. ఇక కేజీ వెండి ధర భారీగా పెరిగింది. 200 రూపాయలు పెరుగుదలతో 53,200 రూపాయలకు చేరింది.

అటు గ్లోబల్ మార్కెట్‌లోనూ బంగారం ధర పడిపోయింది. పసిడి ధర ఔన్స్‌కు 0.91 శాతం తగ్గుదలతో 1,497.10 డాలర్లకు తగ్గింది. అదేవిధంగా వెండి ధర ధర ఔన్స్‌కు 1.46 శాతం తగ్గుదలతో 17.89 డాలర్లకు పడిపోయింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories