Gold Rates: పెట్టుబడుదారులు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు..? గోల్డ్‌ రేట్ పడిపోతుందా?

Gold Rates
x

Gold Rate Today

Highlights

Gold Rates: గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్న విషయం కూడా ధరలపై ప్రభావం చూపింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్‌ ధరలు ప్రతిరోజూ కొంతకొంతగా తగ్గుతున్నాయి.

Gold Rates: బంగారం ధరలు పెరుగుతాయన్నారు.. లక్ష మార్క్‌ కొట్టేస్తుందన్నారు.. ట్రంప్‌ టారిఫ్‌ వడ్డింపుతో రేట్లు వాచిపోతాయన్నారు.. కానీ అంతా రివర్స్‌...! ఎవరూ ఊహించని విధంగా పసిడి ధరలు రోజురోజుకు తగ్గుతూ పోతున్నాయి. ట్రంప్‌ సృష్టించిన ట్రేడ్‌ వార్‌ ఎఫెక్ట్ ఏ మాత్రం కనిపించనట్టే బంగారం ధరలు డౌన్ అవుతున్నాయి. దీంతో గోల్డ్‌ కొనాలనుకునే వారు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే ఈ ట్రెండ్‌ ఇలానే కొనసాగుతుందా? బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా? లేదా మళ్లీ పెరుగుతాయా?

తులం లక్ష మార్క్‌ దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేసినా.. ట్రంప్‌ నిర్ణయం తర్వాత ఒక్కసారిగా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో బంగారం ధరల గ్రామ్‌కు 600 వరకు తగ్గింది. ఏప్రిల్‌4 నాటికి తులం బంగారం ధర 94 వేలు ఉండగా.. ప్రస్తుతం 90 వేల లోపే నమోదవుతోంది.

బంగారం ధరల ఇలా తగ్గడం వెనుక పలు అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్లలో డాలర్ బలపడటంతో బంగారంపై ఒత్తిడి పెరిగింది. సాధారణంగా డాలర్ బలపడినప్పుడు బంగారం ధరలు పడిపోతాయి. ఎందుకంటే బంగారం ధరలను డాలర్‌ ఆధారంగా లెక్కిస్తారు. మరోవైపు, అమెరికా ఫెడ్‌ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలు కూడా బంగారం డిమాండ్‌ తగ్గడానికి కారణమైంది. అటు అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలతో బంగారం లాంటి సురక్షిత ఆస్తులపై ఆసక్తి తగ్గుతోంది.

ఇక వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ లేటెస్ట్‌ డేటా ప్రకారం.. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్న విషయం కూడా ధరలపై ప్రభావం చూపింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్‌ ధరలు ప్రతిరోజూ కొంతకొంతగా తగ్గుతున్నాయి. ఇది దేశీయ మార్కెట్‌లోనూ కనిపిస్తోంది. ఇండియా పరంగా చూస్తే గత కొద్ది వారాల్లో డిమాండ్‌ మందగించింది. పెళ్లిళ్ల సీజన్‌కు ముందే ఎక్కువ మంది కొనుగోళ్లు పూర్తిచేసుకోవడం వల్ల ప్రస్తుతం పసిడి విక్రయాలపై ప్రభావం పడుతోంది. పైగా, బంగారంపై ప్రభుత్వ విధానాలు, ఇంపోర్ట్‌ డ్యూటీలు లాంటి అంశాలు కూడా ట్రేడర్లను వెనక్కి తగ్గేలా చేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories