
Gold Rate Today
Gold Rate Today: భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు రెండు రోజులుగా కాస్త దిగి వస్తున్నాయి . ఈరోజు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold rate today: ఒకపక్క యుద్ధం ప్రపంచ పరిస్థితులను అతలాకుతలం చేస్తోంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్. బంగారం ధరలు ఇప్పటికే దూసుకుపోతున్న పరిస్థితి. రెండు రోజుల క్రితం వరకూ పైకి దూసుకుపోయిన బంగారం ధరలు ఇప్పుడు కాస్త నెమ్మదించాయి. యుద్ధం నేపథ్యంలో మరింత ధరలు పెరుగుతాయి అనే అంచనాల మధ్యలో రేట్లు తగ్గడం పసిడి ప్రియులకు ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.
Gold rate today: ఇరాన్-ఇజ్రాయేల్ యుద్ధ నేపథ్యంలో అమెరికా ఇంకా పెద్ద యుద్ధం జరిగే అవకాశం ఉందని ప్రకటించింది. అయినప్పటికీ బంగారం ధరలు తగ్గాయి. ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుకింగ్స్ కి దిగడమే దీనికి కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆల్ టైమ్ హై నుంచి బంగారం రేట్లు కిందికి దిగిరావడానికి అదే కారణమని భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధరలు 5400 డాలర్ల గరిష్టానికి చేరుకున్న తరువాత ఇప్పుడు కిందికి దిగి వస్తున్నాయి. ఇక దేశీయంగా కూడా బంగారం ధరలు కింది చూపులు చూస్తున్నాయి. రెండురోజుల్లో తులం బంగారం దాదాపుగా 3 వేల రూపాయల వరకూ తగ్గింది.
ఈరోజు బంగారం ధరలు దేశీయంగా ఎలా ఉన్నాయనేది పరిశీలిస్తే..
Gold rate today: మార్చి 2వ తేదీన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,70,510 రూపాయలు ఉండగా అది మార్చి 03 అంటే నిన్న 2,890 రూపాయలు తగ్గి 1,67,620 రూపాయలకు దిగి వచ్చింది. అదే విధంగా మార్చి 2వ తేదీన 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,56,630 రూపాయలుగా ఉన్న బంగారం ధర మార్చి 03న 2,650 రూపాయలు తగ్గి 1,53,650 రూపాయలకు వచ్చింది.
మరోవైపు వెండి ధరలు కూడా కాస్త నెమ్మదించాయని చెప్పవచ్చు. మొన్న మార్చి 2న కేజీ వెండి ధర 3,15,000 రూపాయలు ఉండగా మార్చి 3న నిలకడగా అదే ధర వద్ద కొనసాగింది.
Gold rate today: హైదరాబాద్ లో ఈరోజు బంగారం ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,67,620 రూపాయలుగా ఉంది
22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,56, 630 రూపాయలుగా ఉంది
తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో కూడా కొద్దిగా అటూ ఇటూ గా ఇవే రేట్లు ఉన్నాయి.
ఇక హైదరాబాద్ లో వెండి ధర ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి కేజీకి 3,15,000 రూపాయలుగా ఉంది
నిపుణుల అంచనా ప్రకారం అంతర్జాతీయంగా బంగారం ధరలు నెమ్మదిస్తున్న నేపథ్యంలో ఈరోజు కూడా ధరలు తగ్గే అవకాశం ఉంది. అయితే, స్థానిక డిమాండ్ ఆధారంగా బంగారం ధరల్లో మార్పులు రావచ్చు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన బంగారం ధరలు 04.03.2026 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. మార్కెట్లు ప్రారంభం అయ్యాకా ధరల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు స్థానికంగా ధరలను సరిపోల్చుకుని కొనుగోలు చేయాల్సిందిగా సూచిస్తున్నాం.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




