Gold rate today : శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర... స్థిరంగా వెండి

Gold rate today : శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర... స్థిరంగా వెండి
x
GOld And Silver File Photo
Highlights

హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.

హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 20 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో బంగారం ధర 10 గ్రాములకు 42,390 రూపాయల నుంచి 42',370 రూపాయలకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 40 రూపాయలు తగ్గింది. దీంతో 38,880 రూపాయల నుంచి 38,840 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర దిగివచ్చింది.

నిలకడగా వెండి ధరలు..

బంగారం ధరలు తగ్గినా, వెండి ధరలు మాత్రం మార్పులు లేకుండా నిలిచాయి. కేజీ వెండి ధర స్థిరంగా వుంది. దీంతో నిన్నటి వెండి ధర 49,000 రూపాయల వద్ద నిలిచింది .

విజయవాడ ..విశాఖపట్నంలలోనూ అదేవిధంగా..

ఇక విజయవాడ విశాఖపట్నం లోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి ఇక్కడ 24 క్యారెట్ ల బఁగారం 42,370 రూపాయలకు చేరుకొగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 38,840 రూపాయలు నమోదు చేశాయి. కాగా' వెండి ధర లు ఇక్కడా స్థిరంగా ఉన్నాయి. దీంతో కెజీ వెండీ 49,000 రూపాయలకు చేరుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలో...

ఇక, దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధర లు దిగివచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 40,850 రూపాయలకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయలు తగ్గడంతో 39,550 రూపాయలకు చేరుకుంది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా స్థిరంగా వుంది. దీంతో కేజీ వెండి నిన్నటి ధర వద్దే 49,000 రూపాయలు గా నిలిచింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 15-02-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories