Gold rate: శుభవార్త..భారీగా తగ్గిన బంగారం.. వెండి ధరలూ కిందికే..ఈ వారం ఇలా తగ్గుతూ వచ్చాయి!

Gold rate: శుభవార్త..భారీగా తగ్గిన బంగారం.. వెండి ధరలూ కిందికే..ఈ వారం ఇలా తగ్గుతూ వచ్చాయి!
x
Highlights

Gold Rate: వారమంతా బంగారం, వెండి ధరలు కొద్దిగా కిందికి..మరింత పైకి అన్నట్లు కదిలాయి. దీంతో వారాంతానికి బంగారం భారీగా కిందికి దిగొచ్చింది. ఇక వెండి కూడా అదే దారిలో నడిచింది.

బంగారం భారతీయులకు ఎంతో ఇష్టమైన లోహం. బంగారు ఆభరణాలు ధరించడం.. బంగారంతో చేసిన వస్తువులను వాడటం అంటే అమితమైన ఆసక్తి మనకు. పెళ్లిళ్లలో బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత చెప్పలేనిది. వధువుకు ఎంత బంగారం పుట్టింటి వారిస్తారు.. ఎంత బంగారం అత్తింటి వారు పెడతారు వంటి లెక్కలు అన్ని పెళ్ళిళ్ళలోనూ ప్రధాన చర్చనీయాంశాలలో ఒకటిగా ఉంటుంది. ఇక బంగారం ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి మంచి మార్గంగా ఎక్కువ శాతం భావిస్తున్నారు. అటువంటి పసిడికి సంబంధించి ధరలు ఎలా ఉంటున్నాయనేది తెలుసుకోవాలనే ఆసక్తీ చాలా మందిలో ఉంటుంది. ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఎంత తగ్గింది.. ఎంత పెరిగింది చూడడం సహజం..పదుల రూపాయల్లో పెరిగినా తరిగినా పెద్దగా ప్రజలు పట్టించుకోరు. కానీ, బంగారం విషయంలో మాత్రం రూపాయి తగ్గినా..రూపాయి పెరిగినా అది పెద్ద విషయంలానే లేక్కేస్తారు.

ఇక Gold rate: ఈ వారం పైకెగసిన బంగారం ధరలు..భారీగా పెరిగిన వెండి! బంగారం ధరలు, వెండి ధరలు రోజు రోజూ మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా ధరల్లో మార్పులు నిత్యం జరుగుతుంటాయి. సోమవారం నుంచి శనివారం వరకూ బంగారం మార్కెట్ ధరలు అటూ ఇటూ మారుతూ వస్తాయి. ఆదివారం ట్రేడింగ్ ఉండదు. కొద్దిపాటి మార్పులతో శనివారం సాయంత్రం ఉన్న ముగింపు ధరకే బంగారం అమ్మకాలు జరుగుతాయి.

ఇక గత సోమవారం(అక్టోబర్ 12) నుంచి శనివారం(అక్టోబర్ 17) వరకూ బంగారం ధరల్లో చోటు చేసుకున్న మార్పులు.. చేర్పులపై విశ్లేషణ.

వారాంతంలో భారీగా తగ్గిన పసిడి!

గత వారంలో (అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 18 వరకు) బంగారం ధరలు అటూ ఇటూ కదులుతూనే వచ్చాయి. సోమవారం(అక్టోబర్ 12) కొద్ది పాటి పెరుగుదల తో బంగారం ధరలు ప్రారంభం అయ్యాయి. తరువాత ఒక్క రోజు తప్ప మిగిలిన అన్ని రోజులూ కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చాయి. చివరికి వారాంతానికి భారీ స్థాయిలో కిందికి దిగివచ్చాయి. మొత్తమ్మీద చూసుకుంటే గత వారంకంటె ఈ వారాంతానికి బంగారం ధరలు భారీ స్థాయిలో తగ్గాయి.

గత వారంతంలో పసిడి ధరల కింది చూపులు ఈ వారం కొనసాగాయి. అక్టోబర్ 12 వతేదీ సోమవారం పది గ్రాములకు 50 రూపాయలు పెరిగిన బంగారం ధరలు తరువాతి రోజూ అంటే మంగళవారం (అక్టోబర్ 13) 220 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. బుధవారం (అక్టోబర్ 14) మరికొంచెం కిందికి అంటే పది గ్రాములకు 290 రూపాయలు తగ్గిన బంగారం ధరలు తరువాతి రోజు (అక్టోబర్ 15)న స్వల్పంగా 10 రూపాయలు తగ్గాయి. ఇక అటు తరువాత రోజు(అక్టోబర్16) 180 రూపాయలు పెరిగాయి. శనివారం(అక్టోబర్17) బంగారం ధరలు మళ్ళీ కిందకు దిగి వచ్చాయి. చివరకు శనివారం అక్టోబర్ 12న 1730 రూపాయల భారీ తగ్గుదల తో వారాన్ని ముగించింది పసిడి. వారం మొత్తంగా చూసుకుంటే సోమవారం(అక్టోబర్ 12) 22 కారెట్ల బంగారం పది గ్రాములకు 48,820 రూపాయల వద్ద మార్కెట్లు ప్రారంభం అయ్యాయి. శనివారం(అక్టోబర్ 17) సాయంత్రం 46,800 రూపాయల వద్ద ముగిశాయి. అంటే ఈవారంలో 22 క్యారెట్ల బంగారం ధరలు పడి గ్రాములకు 2020 రూపాయలు తగ్గాయి. ఇక 24 కారెట్ల బంగారం సోమవారం(అక్టోబర్ 12)న పది గ్రాములకు 53,250 రూపాయల వద్ద మార్కెట్లు ప్రారంభం అయ్యాయి. శనివారం (అక్టోబర్ 17) సాయంత్రం 51,050 రూపాయల వద్ద ముగిశాయి. అంటే వారం మొత్తం చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం దాదాపు 2200 రూపాయల భారీ తగ్గుదల కనబరిచింది.

ఇక ప్రస్తుతం దసరా పండుగ సీజన్ కావడం.. అంతర్జాతీయంగా ధరలు కూడా కింది ముఖం పట్టడంతో పసిడి కాస్త కిందికి దిగి రావడం వినియోగదారులకు ఊరతగానే చెప్పొచ్చు. వచ్చే వారంలో కూడా బంగారం ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోక పోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

పసిడి బాటలోనే వెండి ధరలు కిందికి..

ఇక దేశీయంగా వెండి ధరలు ఈవారం భారీగా దిగొచ్చాయి. వారం పొడవునా వెండి ధరలు తగ్గుతూ, పెరుగుతూ వచ్చాయి. వారంలో మూడు రోజుల పాటు భారీ తగ్గుదల నమోదు చేసిన వెండి మరో మూడు రోజులు స్వల్ప పెరుగుదల నమోదు చేసింది. వారం ప్రారంభంలో సోమవారం(అక్టోబర్ 12) కేజీ వెండి 62,910 రూపాయల వద్ద ప్రారంభం అయింది. ఆ రోజు కేజీ వెండి ధర 890 రూపాయలు తగ్గింది... అటు తరువాతి రోజు అంటే మంగళవారం(అక్టోబర్ 13) వెండి ధరలు భారీ తగ్గుదల నమోదు చేశాయి. ఏకంగా కేజీకి 1200 రూపాయల తగ్గుదల చూపించాయి. ఇక ఆ మర్నాడు (అక్టోబర్ 14) కూడా కొద్దిగా తక్కువ స్థాయిలో 600 రూపాయలు తగ్గింది. మళ్ళీ అక్టోబర్ 15వతేదీ గురువారం 1000 రూపాయలు కిందికి దిగింది. అయితే ఆ మర్నాడు అక్టోబర్ 16 న 500 రూపాయలు పెరిగింది. ఇక శనివారం కూడా స్వల్పంగా 100 రూపాయలు తగ్గింది. ఇలా వారం అంతా వెండి ధరలు తగ్గుదల నమోదు చేస్తూ వచ్చాయి. మొత్తమ్మీద వారాంతానికి 62,910 రూపాయల నుంచి 61,700 స్థాయికి వెండి ధరలు దిగోచ్చాయి. అంటే ఒక్క వారంలో కేజే వెండి 1210 రూపాయలు తగ్గింది.

ఇక ఈవారం దసరా పండుగ హడావుడి మొదలైంది. దీపావళి కూడా రానుంది. ఈ సమయంలో బంగారం, వెండి ధరలు కిందికి దిగిరావడం శుభపరిణామంగా చెప్పొచ్చు. పసిడి ప్రేమికులకు ఇది కాస్త ఉపశమనం కలిగించేదే. ఇక అంతర్జాతీయంగా బంగారం ధరలు పెద్దగా మార్పులు చూపించకపోవడంతో వచ్చే వారం కూడా కొద్దిపాటి మార్పులతో ఇంచుమించుగా ఇలానే ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories