Gold Rate Today: బంగారం ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు..తులం ఎంతంటే..?

Gold Rate Today: పెళ్లిళ్ల సీజన్ మొదలైంది.. శుభకార్యాల సందడితో జువెలరీ షాపులు కిటకిటలాడుతున్నాయి. అయితే, నగలు చేయించుకుందామని ప్లాన్ చేస్తున్న సామాన్యులకు మాత్రం పసిడి చుక్కలు చూపిస్తోంది.

Naresh.k
Published on: 21 Feb 2026 11:00 AM IST
Gold Rate Today
X

Gold Rate Today: బంగారం ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు..తులం ఎంతంటే..?

Gold Rate Today: పెళ్లిళ్ల సీజన్ మొదలైంది.. శుభకార్యాల సందడితో జువెలరీ షాపులు కిటకిటలాడుతున్నాయి. అయితే, నగలు చేయించుకుందామని ప్లాన్ చేస్తున్న సామాన్యులకు మాత్రం పసిడి చుక్కలు చూపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న పరిణామాలు, యుద్ధ మేఘాలు దేశీయంగా బంగారం ధరలకు రెక్కలు తెస్తున్నాయి. వరుసగా రెండో రోజూ ధరలు పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.

భాగ్యనగర బులియన్ మార్కెట్లో నేడు పసిడి ధరలు భారీగా ఎగబాకాయి. వివరాల్లోకి వెళ్తే:24 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోలిస్తే నేడు తులం (10 గ్రాములు) పై ఏకంగా రూ. 880 పెరిగింది. దీంతో నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,57,370 వద్దకు చేరింది.22 క్యారెట్ల బంగారం, ఆభరణాల తయారీకి వాడే ఈ బంగారం ధర నేడు రూ. 800 పెరిగి, తులం ధర రూ. 1,44,250 కి చేరుకుంది.వెండి మాత్రం స్వల్ప ఊరటనిచ్చింది. నిన్నటి భారీ పెరుగుదల తర్వాత నేడు ధర స్థిరంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 2,70,000 వద్ద కొనసాగుతోంది.

ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా..ఇరాన్‌పై అమెరికా దాడి చేయవచ్చనే వార్తలు ప్రపంచ మార్కెట్లను వణికిస్తున్నాయి. ఇలాంటి అస్థిర పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ కంటే సురక్షితమైన బంగారం పై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చన్న సంకేతాలు, ఇతర దేశాలపై విధిస్తున్న భారీ సుంకాలు కూడా ధరల పెరుగుదలకు ప్రధాన కారణమయ్యాయి.దేశవ్యాప్తంగా వేలాది పెళ్లిళ్లు జరుగుతుండటంతో స్థానికంగా బంగారానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది.అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 5,106 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది మున్ముందు దేశీయ ధరలను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉంది.

ముఖ్య గమనిక: పైన పేర్కొన్న ధరలు ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. బులియన్ మార్కెట్‌లో ధరలు నిమిష నిమిషానికి మారుతుంటాయి. కాబట్టి మీరు బంగారం కొనాలనుకుంటే, షాపుకు వెళ్లే ముందు ఒకసారి మీ స్థానిక జువెలరీ మర్చంట్‌ను సంప్రదించి ఖచ్చితమైన ధర తెలుసుకోవడం ఉత్తమం.

Naresh.k

Naresh.k

Next Story