Gold Price Today: మహిళలకు శుభవార్త..పసిడి ధర ఢమాల్..ఏకంగా రూ. 4వేలు పతనం

Today Gold Rate
x

Today Gold Rate

Highlights

Gold Price Today: బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. బంగారం ధర భారీగా పతనం అయ్యింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి సమయం..అసలు మిస్ చేసుకోవద్దు.

Gold Price Today: పసిడి ప్రియులకు ఇది కచ్చితంగా శుభవార్తే అని చెప్పవచ్చు. బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. కొనేవారికి ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర దిగి రావడం వల్ల ఆ ప్రభావం విదేశీ మార్కెట్లపై కూడా పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఆ ప్రభావం వల్ల మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలపై కూడా కనిపించింది. హైదరాబాద్, వైజాగ్ వంటి ప్రాంతాల్లో బంగారం ధరలు గత వారం రోజుల్లో చూసినట్లయితే..భారీగా తగ్గాయి. ఇది సానుకూల అంశమని చెప్పవచ్చు. బంగారం ధరలతోపాటు వెండి కూడా పతనమైయ్యింది.

బంగారంధరలను పరిశీలించినట్లయితే నవంబర్ 8న రూ. 79, 470 వద్ద ఉంది. అయితే తర్వాత బంగారం ధర పడిపోతూ వస్తోంది. నవంబర్ 15న బంగారం ధర రూ. 75,760 ఉంది. అంటే బంగారం ధర ఏకంగా 3,700 వరకు తగ్గింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారంకు ఈ ధర వర్తిస్తుంది. 22 క్యారెట్ల బంగారం ధరలను చూసినట్లయితే..ఈ బంగారం ధర కూడా పడిపోయింది. బంగారం ధర నవంబర్ 8న రూ. 72, 850 ఉంది. అయితే ఇప్పుడు ఈ ధర నవంబర్ 15న రూ. 69, 450 కి దిగింది. రూ. 3,400 వరకు పడిపోయింది.

వెండి ధర కూడా తగ్గుతూ వస్తోంది. నవంబర్ 9న 1,03,000 వద్ద ఉంది. కేజీకి ఈ ధరలు వర్తిస్తాయి. ఈ ధర ఇప్పుడు నవంబర్ 15న వచ్చేసరికి రూ. 99 వేలకు పడిపోయింది. అంటే వెండి ధర ఏకంగా 4వేలకు దిగివచ్చింది. అయితే బంగారం ధరలను వస్తు సేవల పన్ను జీఎస్జీ అదనంగా ఉంటంది. మేకింగ్ ఛార్జీలు కూడా అదనంగా ఉంటాయి. వీటన్నింటిని కలుపుకుంటే బంగారం ధరలు ఇకాం పైకి చేరుకుంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories