మరింత తగ్గిన బంగారం ధర!

మరింత తగ్గిన బంగారం ధర!
x
Highlights

గురువారం బంగారం ధర 140 రూపాయల మేర పడిపోయింది. ఇక వెండి ధర లో ఎటువంటి మార్పూ లేదు. దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం...

గురువారం బంగారం ధర 140 రూపాయల మేర పడిపోయింది. ఇక వెండి ధర లో ఎటువంటి మార్పూ లేదు. దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 140రూపాయలు తగ్గి 39,360 రూపాయలుగా నిలిచింది. అదేసమయంలో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర 140రూపాయల తగ్గుదలతో 36,110రూపాయలకు చేరింది. ఇక మార్కెట్ లో వెండి ధరలో ఎటువంటి మార్పూ లేదు. కేజీ వెండి ధర 48,765రూపాయల వద్ద స్థిరంగా వుంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలున్నాయి.

ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 90 రూపాయలు తగ్గి నిన్నటి ధర 38,010రూపాయలకు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయలు తగ్గి 36,900రూపాయల వద్దకు చేరింది. కేజీ వెండి ధర మాత్రం నిలకడగానే ఉంది. నిన్నటి ధర 48,765రూపాయలు కొనసాగుతోంది.

గ్లోబల్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర దిగివచ్చింది. పసిడి ధర ఔన్స్‌కు 1.1శాతం తగ్గి 1,499.05 డాలర్లకు దిగింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.92 శాతం క్షీణించి 17.75 డాలర్లకు దిగొచ్చింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories